AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిక్స్‌డ్ డిపాజిట్లను తీసిపారేయొద్దు.. ఏకంగా 10 బెనిఫిట్స్ పొందోచ్చు.. ఈ లాభాల గురించి ఎవరూ చెప్పరు..

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను చాలామంది లైట్ తీసుకుంటారు. ఎందుకంటే తక్కువ వడ్డీ మాత్రమే అందుతుందని అనుకుంటారు. కానీ ఎఫ్‌డీల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయనేది చాలామందికి అవగామన ఉండదు. ఏకంగా 10 లాభాలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పొందవచ్చు. అవేంటి అనేది ఈ కథనంలో చూద్దాం

ఫిక్స్‌డ్ డిపాజిట్లను తీసిపారేయొద్దు.. ఏకంగా 10 బెనిఫిట్స్ పొందోచ్చు.. ఈ లాభాల గురించి ఎవరూ చెప్పరు..
Fixed Deposit
Venkatrao Lella
|

Updated on: Nov 14, 2026 | 3:51 PM

Share

చాలామంది ఫిక్స్‌డ్ డిపాజిట్లను చాలా తేలిగ్గా తీసుకుంటారు. తక్కువ వడ్డీ మాత్రమే ఉండటంతో ఎక్కువ ఆదాయం రాదని తీసిపారేస్తూ ఉంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బదులు బంగారం, మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడి పెడితే ఎక్కువ ఆదాయం వస్తుందని భావిస్తుంటారు. దీంతో ఎక్కువమంది తమ డబ్బులు పొదుపు చేసుకునేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బదులు పోస్టాఫీస్, కేంద్ర ప్రభుత్వ స్కీమ్, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లను ఎంచుకుంటారు. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఈ డిపాజిట్ల వల్ల ఏకంగా 10 లాభాలు ఉన్నాయి. అవేంటంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల లాభాలెన్నో..

-ఫిక్స్‌డ్ డిపాజిట్లలో గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే వడ్డీ రేట్లు ముందే ఫిక్స్ అయి ఉంటాయి. దీని వల్ల మీకు ఎంత ఆదాయం వస్తుందనేది ముందుగానే లెక్కించుకోవచ్చు. దీనికి అనుగుణంగా మీ ఆర్ధిక అవసరాలను ప్లాన్ చేసుకోవచ్చు

-బంగారం, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు లాంటివి ఒడిదొడులకు లోనవుతాయి. అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ పరిస్థితులను బట్టి తారుమారవుతుంటాయి. దీని వల్ల రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుది. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఎలాంటి రిస్క్ అనేదే ఉండదు.

-ఫిక్స్‌డ్ డిపాజిట్ల భద్రత కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యం అమల్లో ఉంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(DICGC) ఈ సదుపాయం కల్పిస్తోంది. మీ డిపాజిట్ మొత్తం, వడ్డీకి ఈ బీమా వర్తిస్తుంది. మీ డిపాజిట్లకు ఏమైనా నష్టం జరిగితే బ్యాంకులు ఇవి చెల్లిస్తాయి. దీంతో మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు సేఫ్ అని చెప్పుకోవచ్చు

-ఈ డిపాజిట్లకు మెచ్యూరిటీ పీరియడ్ మీరే సెట్ చేసుకోవచ్చు. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య ఎంత కాలపరిమితి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. అవసరమైతే నగదు ఎప్పుడైనా సులువుగా విత్ డ్రా చేసుకోవచ్చు

-సేవింగ్స్ అకౌంట్లో కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్లకు 2 శాతం వరకు వడ్డీ రేటు ఉంటే ఎఫ్‌డీలకు 7 శాతం వరకు ఉంది. కొన్ని బ్యాంకులు 8 శాతం కూడా ఆఫర్ చేస్తున్నాయి

-సాధారణ వ్యక్తులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలకు ఎక్కువ వడ్డీ ఉంటుంది

-ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లోన్ ఫెసిలిటీ, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ వంటివి పొందవచ్చు. మీకు నగదు అత్యవసరమైనప్పుడు ఎఫ్‌డీ విత్ డ్రా చేసుకోకుండా ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. మీ ఎఫ్‌డీ విలువలో 90 నుంచి 95 శాతం వరకు లోన్ అందిస్తారు

-ఇక ఎఫ్‌డీలో డిపాజిట్ చేయడం ద్వారా ట్యాక్స్ మినహాయింపులు కూడా పొందవచ్చు. సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ రిలీఫ్ ఉంటుంది

-నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి వడ్డీ అందేలా మీరు సెలక్ట్ చేసుకోవచ్చు. కాంపౌండ్ వడ్డీ కోసం రీఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు

-అత్యవసర పరిస్థితుల్లో మీరు పాక్షికంగా విత్ డ్రా చేసుకోవం లేదా మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. కాకపోతే స్వల్ప మొత్తంలోనే పెనాల్టీ ఉంటుంది.

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో