Fixed Deposit
ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) తన కస్టమర్లకు ప్రీ దివాళి గిఫ్ట్ ను అందించింది. తన బ్యాంకులో చేసే ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 50 బేసిస్ పాయింట్లను పెంచింది. రూ. 2కోట్ల కంటే తక్కువ పెట్టుబడి పెట్టే వినియోగదారులకు కొత్త వడ్డీ రేటు వర్తిస్తుంది. కొత్త వడ్డీ రేటు 2023, నవంబర్ ఒకటి నుంచి అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల వినియోగదారులకు అధిక వడ్డీతో పాటు వారి పెట్టుబడులపై ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కొత్త వడ్డీ రేట్లు ఇప్పుడు చూద్దాం..
- 7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు వడ్డీ రేటు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 4.00 శాతం ఉంటుంది.
- 15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజానీకానికి వడ్డీ రేటు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం బ్యాంకు అందిస్తోంది.
- 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజానీకానికి వడ్డ రేటు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం అందిస్తారు.
- 46 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు వడ్డీ రేటు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం వరకూ అందిస్తారు.
- 91 రోజుల నుంచి 179 రోజుల వరకు: సాధారణ ప్రజానీకానికి వడ్డీ రేటు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం అందిస్తారు.
- 180 రోజుల నుంచి 270 రోజుల వరకు: సాధారణ ప్రజానీకానికి వడ్డీ రేటు 6 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం ఇస్తారు.
- 271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజానీకానికి వడ్డీ రేటు 6.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం ఉంటుంది.
- 1 సంవత్సరం కాలపరిమితితో ఉండే ఎఫ్ డీ కి సాధారణ ప్రజలకు వడ్డీ రేటు 6.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం ఉంటుంది.
- 1 సంవత్సరం నుంచి 443 రోజుల కంటే ఎక్కువ వ్యవధికి సాధారణ ప్రజానీకానికి 6.80 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం.
- 444 రోజుల వ్యవధికి సాధారణ ప్రజానీకం 7.25 శాతం; సీనియర్ సిటిజన్లు 7.75 శాతం వడ్డీ రేటు పొందుతారు.
- 445 నుంచి 665 రోజులు: సాధారణ ప్రజానీకం 6.80 శాతం; సీనియర్ సిటిజన్లు 7.30 శాతం.
- 666 రోజులు: సాధారణ ప్రజానీకం 7.05 శాతం; సీనియర్ సిటిజన్లు 7.55 శాతం.
- 667 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజానీకం 6.80 శాతం; సీనియర్ సిటిజన్లు 7.30 శాతం
- 2 నుంచి 3 సంవత్సరాల కంటే ఎక్కువ: సాధారణ ప్రజానీకం 7.00 శాతం; సీనియర్ సిటిజన్లు 7.50 శాతం
- 3 నుంచి 5 సంవత్సరాల కంటే ఎక్కువ: సాధారణ ప్రజానీకం 6.50 శాతం; సీనియర్ సిటిజన్లు 7.00 శాతం
- 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజానీకం 6.50 శాతం; సీనియర్ సిటిజన్లు 7.30 శాతం
- 444 రోజుల కాలవ్యవధికి సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం వడ్డీ రేటు అందించబడుతుంది. బ్యాంక్ సవరించిన ఎఫ్డీ రేట్లు కస్టమర్‌లకు వారి డిపాజిట్లపై మరింత పోటీతత్వ రాబడిని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
లాభాల బాటలో..
పీఎన్బీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది, 2023ఆర్థిక సంవత్సరం క్వార్టర్2లో రూ. 411.27 కోట్ల నుంచి రూ. 1,756 కోట్లకు 327 శాతం వృద్ధిని నమోదు చేసింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం కూడా గణనీయమైన వృద్ధిని కనబరిచింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 8,271 కోట్ల నుంచి రూ. 9,922 కోట్లకు 20 శాతం వృద్ధిని సాధించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..