Gas Cylinder: గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. కొత్త గ్యాస్ కనెక్షన్ డిపాజిట్‌ భారీగా పెంపు.. ఈ రోజు నుంచి అమలు

Gas Cylinder: ద్రవ్యోల్బణం మరో దెబ్బ కొట్టింది. ముందే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులకు మరో షాక్‌ తగిలింది..

Gas Cylinder: గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. కొత్త గ్యాస్ కనెక్షన్ డిపాజిట్‌ భారీగా పెంపు.. ఈ రోజు నుంచి అమలు

Updated on: Jun 28, 2022 | 1:30 PM

Gas Cylinder: ద్రవ్యోల్బణం మరో దెబ్బ కొట్టింది. ముందే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులకు మరో షాక్‌ తగిలింది. కొత్త గ్యాస్ కనెక్షన్ పొందడం నేటి నుంచి ఖరీదైనదిగా మారింది. దేశీయ LPG గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌ల సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచిన తర్వాత, చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌ల రేట్లను కూడా పెంచాయి. ఇటీవల ప్రకటించిన ఈ సెక్యూరిటీ డిపాజిట్‌ పెంపు ఈరోజు అంటే 28 జూన్ 2022 నుండి అమలులోకి వచ్చింది. కొత్త రేట్ల ప్రకారం.. ఇప్పుడు వినియోగదారులు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.1,050 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.2,550 నుంచి రూ.3,600కి పెంచాయి.

ఇది మాత్రమే కాదు, 47.5 కిలోల వాణిజ్య సిలిండర్ కనెక్షన్ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ కూడా పెరిగింది. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కోసం కస్టమర్లు రూ.7,350 సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రేట్ల ప్రకటనకు ముందు రూ.6,450గా ఉంది. ఇందులో ఒక్కో సిలిండర్‌పై రూ.900 పెరిగింది.

ఇది కాకుండా 19 కిలోల సిలిండర్‌ను లాట్ వాల్వ్‌తో అనుసంధానించడానికి సెక్యూరిటీ డిపాజిట్‌ను రూ.4,800 నుంచి రూ.5850కి పెంచారు. అదేవిధంగా 47.5 కిలోల వాల్వ్ లాట్ వాల్వ్‌పై సెక్యూరిటీ డిపాజిట్‌ను రూ.8,700 నుంచి రూ.9,600కి పెంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us