Diwali Sale: డిస్కౌంట్ల తారజువ్వలు ఎగసిపడుతున్నాయ్‌.. ఆ కార్లపై ఏకంగా రూ. 3.5లక్షల వరకూ తగ్గింపు.. త్వరపడండి..

ఏదైనా మంచి ఎస్‌యూవీ కారు కొనాలనే ప్రణాళికలో ఉంటే ఇదే మంచి సమయం. ప్రస్తుతం అంతా ఫెస్టివ్‌ సీజన్లో ఉన్నాం కదా. అన్ని బ్రాండ్లు తమ ఉత్పత్తులపై పలు ఆఫర్లను అందిస్తున్నాయి. అందులో భాగంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా బ్రాండ్‌ కుచెందిన పలు కార్లపై అదిరే ఆఫర్లు, తగ్గింపు ధరలు లభిస్తున్నాయి. ఏకంగా రూ. 3.5లక్షల వరకూ నగదు ఆదా చేసుకొనే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది.

Diwali Sale: డిస్కౌంట్ల తారజువ్వలు ఎగసిపడుతున్నాయ్‌.. ఆ కార్లపై ఏకంగా రూ. 3.5లక్షల వరకూ తగ్గింపు.. త్వరపడండి..
Mahindra Cars

Edited By: Ravi Kiran

Updated on: Nov 07, 2023 | 8:55 PM

మన దేశంలో కార్ల బ్రాండ్లలో మహీంద్రా అండ్‌ మహీంద్రాకి మంచి డిమాండే ఉంది. ఎస్‌యూవీ వేరియంట్లలో ఈ బ్రాండ్‌కు వినియోగదారుల మద్దతు ఉంది. మీరు ఒకవేళ ఈ మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ కార్లు కొనుగోలు చేయాలన్నా లేదా.. ఏదైనా మంచి ఎస్‌యూవీ కారు కొనాలనే ప్రణాళికలో ఉన్నా ఇదే మంచి సమయం. ప్రస్తుతం అంతా ఫెస్టివ్‌ సీజన్లో ఉన్నాం కదా. అన్ని బ్రాండ్లు తమ ఉత్పత్తులపై పండుగ ఆఫర్లను అందిస్తున్నాయి. అందులో భాగంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా బ్రాండ్‌ కుచెందిన పలు కార్లపై అదిరే ఆఫర్లు, తగ్గింపు ధరలు లభిస్తున్నాయి. ఏకంగా రూ. 3.5లక్షల వరకూ నగదు ఆదా చేసుకొనే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది. దీపావళి సందర్భంగా ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ300, బొలెరో నియో కాంపాక్ట్ ఎస్‌యూవీ, మారాజో ఎంపీవీ, బొలేరో ఎస్‌యూవీ కార్లపై రూ. 3.5 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. అయతే స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్, థార్ వంటి కొన్ని ప్రముఖ ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై మాత్రం ఈ ఆఫర్లు లేవు. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మహీంద్రా ఎక్స్‌యూవీ400.. మహీంద్రా పోర్ట్‌ఫోలియోలోని ఏకైక ఆల్-ఎలక్ట్రిక్ కారు ఇది. టాప్‌ స్పెక్‌ ఈఎల్‌ వేరియంట్‌పై వినియోగదారులకు రూ 3.5 లక్షల వరకు నగదు తగ్గింపు,ఈఎస్‌సీతో కూడిన ఈఎల్‌ వేరియంట్‌పై రూ. 3 లక్షల వరకు గరిష్టంగా తగ్గింపు పొందవచ్చు. ఈ నవంబర్‌లో తక్కువ-స్పెక్ ఈసీ ట్రిమ్‌పై రూ.1.5 లక్షల వరకూ డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఎక్స్‌యూవీ300.. మహీంద్రా నుంచి వస్తున్న చిన్న సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీపై కొనుగోలుదారులు ఈ దీపావళికి రూ. 1.2 లక్షల వరకు వివిధ ప్రయోజనాలను పొందుతారు. డబ్ల్యూ8 వేరియంట్‌పై ₹ 1.2 లక్షల వరకు ప్రయోజనాలు వర్తిస్తాయి. ఇందులో రూ. 95,000 నగదు తగ్గింపుకాగా రూ. 25,000 విలువైన ఉపకరణాలు ఉన్నాయి. డబ్ల్యూ6 వేరియంట్‌పై కొనుగోలుదారులు రూ. 80,000 వరకు తగ్గింపును పొందవచ్చు , ఇందులో రూ. 25,000 విలువైన మహీంద్రా ఉపకరణాలు ఉన్నాయి .

ఇవి కూడా చదవండి

బొలెరో, బొలెరో నియో.. మహీంద్రా బొలెరోపై రూ. 70,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 55,000 నగదు తగ్గింపు కాగా రూ. 20,000 విలువైన ఉపకరణాలు ఉన్నాయి. బీ6,బీ6 ఆప్షనల్ ట్రిమ్‌లపై వరుసగా రూ. 35,000, రూ. 70,000 తగ్గింపును పొందుతారు.

బొలెరో నియో ఎస్‌యూవీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కొనుగోలుదారు టాప్-ఎండ్ ఎన్‌10, ఎన్‌10 ఆప్షనల్ వేరియంట్‌లపై రూ. 50,000 వరకు తగ్గింపును పొందవచ్చు . ఎన్‌8, ఎన్‌4 వేరియంట్‌లు వరుసగా రూ. 31,000, రూ. 25,000 వరకు ప్రయోజనాలను పొందుతారు.

మరాజ్జో ఎంపీవీ.. ఈ నవంబర్‌లో ఈ ఎంపీవీ కొనుగోలుపై మహీంద్రా రూ. 73,300 తగ్గింపును అందిస్తోంది . మొత్తం మోడల్ శ్రేణిలో రూ. 15,000 విలువైన జెన్యూన్‌ ఉపకరణాలతో పాటు రూ. 58,300 నగదు తగ్గింపు లభిస్తుంది.

ఈ తగ్గింపులు పరిమితకాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. అలాగే సంబంధిత డీలర్‌షిప్‌ల వద్ద మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న కారు స్టాక్‌ను బట్టి కూడా ఆఫర్లు ఉంటాయని, వినియోగదారులు గమనించాలని మహీంద్రా పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..