Home Loan: హోమ్‌లోన్ చెల్లింపు భారంగా ఉందా..? ఈ టిప్స్‌తో రీపేమెంట్ మరింత ఈజీ

సొంత ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి చిరకాల కలగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఉండే సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు బ్యాంకు రుణాలను తీసుకుంటూ ఉంటారు. నెలనెలా అద్దె ఇంటికి కట్టే అద్దెతో ఈఎంఐ చెల్లిస్తూ సొంత ఇల్లును కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే హోమ్‌లోన్ తీసుకుని ఇల్లు తీసుకోవడం మొదట్లో బాగానే రోజులు గడిచే కొద్దీ పెరిగిన ఖర్చుల నేపథ్యంలో హోమ్ లోన్ రీపెమెంట్ ఇబ్బందిగా ఉంటుంది.

Home Loan: హోమ్‌లోన్ చెల్లింపు భారంగా ఉందా..? ఈ టిప్స్‌తో రీపేమెంట్ మరింత ఈజీ
Home Loan
Follow us

|

Updated on: Aug 15, 2024 | 4:00 PM

సొంత ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి చిరకాల కలగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఉండే సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు బ్యాంకు రుణాలను తీసుకుంటూ ఉంటారు. నెలనెలా అద్దె ఇంటికి కట్టే అద్దెతో ఈఎంఐ చెల్లిస్తూ సొంత ఇల్లును కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే హోమ్‌లోన్ తీసుకుని ఇల్లు తీసుకోవడం మొదట్లో బాగానే రోజులు గడిచే కొద్దీ పెరిగిన ఖర్చుల నేపథ్యంలో హోమ్ లోన్ రీపెమెంట్ ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గృహ రుణ భారాన్ని తగ్గించుకోవడానికి, రుణానికి సంబంధించిన మొత్తం వ్యయాన్ని సమర్థవంతంగా తగ్గించుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. హోమ్‌లోన్ విషయంలో నిపుణుల సూచనలను ఓ సారి తెలుసుకుందాం.

ఈఎల్‌బీఆర్ మార్పు

మీరు చాలా సంవత్సరాల నుంచి ఇంటి రుణం తీసుకుంటే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్) అమలు చేయవచ్చని నిపుణులు చెల్లిస్తున్నారు. ఎందుకంటే ఈబీఎల్ఆర్‌కు మారడం వల్ల తక్కువ వడ్డీ రేటుతో  గృహ రుణాన్ని చెల్లించవచ్చు. ఈబీఎల్ఆర్ మారాలంటే మీ రుణదాతను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈబీఎల్ఆర్ రేట్లు మార్కెట్ వడ్డీ రేట్లతో హెచ్చుతగ్గులకు లోనవుతున్నందున గృహ రుణాన్ని పొదుపు చేసుకోవచ్చు. 

క్రెడిట్ స్కోర్

చాలా మంది రుణగ్రహీతలు తక్కువ క్రెడిట్ స్కోర్‌ల కారణంగా అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ రుణాన్ని క్రమం తప్పకుండా తిరిగి చెల్లించి, మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకుంటే మీరు తక్కువ వడ్డీ విధించమని రుణదాతను కోరవచ్చు. మెరుగైన క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా వడ్డీ రేటును నిర్ణయించే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కాలపరిమితి పెంపు

మీ హోమ్ లోన్ కాలపరిమితిని పొడిగించడం వల్ల మీ నెలవారీ ఈఎంఐను తగ్గించవచ్చు. మీరు ప్రిన్సిపల్‌లో గణనీయమైన భాగాన్ని తిరిగి చెల్లిస్తే పదవీ విరమణ వయస్సు వరకు రుణ వ్యవధిని పొడిగించుకోవచ్చు. లోన్ కాలపరిమితిని 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు పొడిగించడం వల్ల ఈఎంఐ గణనీయంగా తగ్గుతుంది. అయితే, పదవీకాలాన్ని పొడిగించడం వల్ల  వడ్డీ పెరుగుతుందనే విషయాన్ని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

రుణ బదిలీ

రుణదాతల మధ్య వడ్డీ రేట్లు గణనీయంగా మారవచ్చు. మీ ప్రస్తుత రుణదాత రేట్లు ఇతర బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అందించే వాటి కంటే ఎక్కువగా ఉన్నాయని మీకు అనిపిస్తే మీ లోన్‌ని బదిలీ చేయవచ్చు. తక్కువ రేట్లు ఉన్న బ్యాంకును సంప్రదించి రుణ బదిలీ ద్వారా తక్కువ వడ్డీ రేటుతో గృహ రుణాన్ని చెల్లించవచ్చు. 

పార్షియల్ పేమెంట్

ఫ్లోటింగ్ రేటు హోమ్ లోన్‌పై పార్షియల్ చెల్లింపులు చేయడం వల్ల ప్రిన్సిపల్ మొత్తాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. తద్వారా లోన్ కాలపరిమితి తగ్గుతుంది. మీరు అసలు పదవీకాలాన్ని కొనసాగించాలనుకుంటే ముందస్తు చెల్లింపు తర్వాత మీ ఈఎంఐ మొత్తాన్ని సర్దుబాటు చేయవచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ మీ లోన్‌ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హోమ్‌లోన్ చెల్లింపు భారంగా ఉందా..?ఈ టిప్స్‌తో రీపేమెంట్ మరింత ఈజీ
హోమ్‌లోన్ చెల్లింపు భారంగా ఉందా..?ఈ టిప్స్‌తో రీపేమెంట్ మరింత ఈజీ
మొబైల్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఈ ఫోన్‌పై రూ.7 వేలు తగ్గింపు!
మొబైల్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఈ ఫోన్‌పై రూ.7 వేలు తగ్గింపు!
అమెజాన్‌లో ఆ టీవీలపై బంపర్ ఆఫర్.. ది బెస్ట్ టీవీలు ఏంటంటే..?
అమెజాన్‌లో ఆ టీవీలపై బంపర్ ఆఫర్.. ది బెస్ట్ టీవీలు ఏంటంటే..?
రోజూ జొన్నరొట్టె తింటే మీ శరీరంలో జరిగే మార్పులు తెలుసుకోండి..!
రోజూ జొన్నరొట్టె తింటే మీ శరీరంలో జరిగే మార్పులు తెలుసుకోండి..!
మందులో సోడా, కూల్‌డ్రింక్ కలుపుకుని తాగుతున్నారా? షాకింగ్ స్టోరీ
మందులో సోడా, కూల్‌డ్రింక్ కలుపుకుని తాగుతున్నారా? షాకింగ్ స్టోరీ
సాగర గర్భంలో లెహరావో తిరంగా.. చూస్తే సలాం చేయాల్సిందే.!
సాగర గర్భంలో లెహరావో తిరంగా.. చూస్తే సలాం చేయాల్సిందే.!
ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో రాబడి వరద.. ఏడాదిలో ఊహకందని లాభాలు
ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో రాబడి వరద.. ఏడాదిలో ఊహకందని లాభాలు
మాజీ భర్త గే అంటూ కామెంట్స్.. వీడియో రిలీజ్..
మాజీ భర్త గే అంటూ కామెంట్స్.. వీడియో రిలీజ్..
మీరు ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేశారా..? కేవలం 10 రోజుల్లోనే రీఫండ్‌
మీరు ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేశారా..? కేవలం 10 రోజుల్లోనే రీఫండ్‌
ఆంధ్రా కేడర్ ఐపీఎస్‌కు.. జమ్మూకశ్మీర్‌లో కీలక పదవి.!
ఆంధ్రా కేడర్ ఐపీఎస్‌కు.. జమ్మూకశ్మీర్‌లో కీలక పదవి.!
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.