AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: దుబాయ్‌లో బంగారం కొనడం నిజంగా లాభమేనా..? అసలు లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

దుబాయ్ ట్రిప్ అంటేనే.. అందరికీ గుర్తొచ్చేది బంగారం.. భారత్ కంటే అక్కడ ధర తక్కువగా ఉంటుందని, క్వాలిటీ బాగుంటుందని చాలా మంది బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తారు. అయితే దుబాయ్‌లో బంగారం కొనడం నిజంగానే లాభమేనా..? లేక పన్నులు కలిపితే మన ధరకే సమానమవుతుందా? అనేది తెలుసుకుందాం..

Gold: దుబాయ్‌లో బంగారం కొనడం నిజంగా లాభమేనా..? అసలు లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
Is Buying Gold In Dubai Really Cheape
Krishna S
|

Updated on: Feb 15, 2026 | 9:15 AM

Share

విదేశీ ప్రయాణం అనగానే భారతీయులకు గుర్తొచ్చే మొదటి వస్తువు బంగారం. ముఖ్యంగా దుబాయ్‌లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయని, నాణ్యత బాగుంటుందని చాలా మంది అక్కడ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో దుబాయ్ నుండి మన దేశానికి బంగారం తేవడం నిజంగా లాభదాయకమేనా? దీనిపై ఉన్న నిబంధనలేంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ధర ఎందుకు తక్కువ?

భారత్‌తో పోలిస్తే దుబాయ్‌లో బంగారం ధర కొంత తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం పన్నుల వ్యత్యాసం. భారత్‌లో బంగారంపై దిగుమతి సుంకం, ఇతర పన్నులు ఎక్కువగా ఉంటాయి. దుబాయ్‌లో ఈ పన్నుల భారం తక్కువగా ఉండటం వల్ల అక్కడ గ్రాముకు కొన్ని వందల రూపాయల తేడా కనిపిస్తుంది.

ఎంత బంగారం తేవచ్చు?

దుబాయ్ నుండి భారత్‌కు బంగారం తీసుకురావడానికి కస్టమ్స్ శాఖ కొన్ని కఠిన రూల్స్ అమలు చేస్తోంది. ఈ రాయితీలు మీరు అక్కడ ఎంత కాలం ఉన్నారు అనే దానిపై ఆధారపడి ఉంటాయి. దుబాయ్‌లో ఒక సంవత్సరం అంతకంటే ఎక్కువ కాలం నివసించిన భారతీయులకు కస్టమ్స్ డ్యూటీలో మినహాయింపు ఉంటుంది. పురుషులు గరిష్టంగా 20 గ్రాముల వరకు బంగారం తీసుకరావచ్చు. మహిళలు గరిష్టంగా 40 గ్రాముల వరకు బంగారం తీసుకరావచ్చు. దీనిపై పన్ను ఉండదు. అయితే తక్కువ కాలం పర్యటనకు వెళ్లే వారికి ఈ పన్ను మినహాయింపులు వర్తించవు. వారు తెచ్చే ప్రతి గ్రాముపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఆభరణాలా? బిస్కెట్లా?

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పన్ను మినహాయింపు కేవలం బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. మీరు గోల్డ్ కాయిన్స్, లేదా గోల్డ్ బార్స్ తీసుకురావాలనుకుంటే, పన్ను మినహాయింపు ఉండదు. గరిష్టంగా 1 కిలో వరకు బంగారం తీసుకురావడానికి అనుమతి ఉన్నప్పటికీ దానిపై ప్రభుత్వం నిర్ణయించిన దిగుమతి సుంకాన్ని తప్పనిసరిగా చెల్లించాలి.

బిల్లు లేకపోతే కఠిన చర్యలు

దుబాయ్ నుండి బంగారం కొన్నప్పుడు తప్పనిసరిగా సరైన బిల్లులను వెంట ఉంచుకోవాలి. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత మీ వద్ద ఉన్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులకు స్వచ్ఛందంగా ప్రకటించాలి. ఒకవేళ పరిమితికి మించి ఉండి అధికారులకు చెప్పకుండా పట్టుబడితే.. జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కాగా దుబాయ్‌లో మేకింగ్ ఛార్జీలు తక్కువగా ఉండటం, నాణ్యతపై నమ్మకం ఉండటం వల్ల అక్కడ కొనడం మంచిదే. కానీ కస్టమ్స్ పన్నులు కలిపిన తర్వాత భారత్‌లో ధరతో పోలిస్తే పెద్దగా వ్యత్యాసం లేకపోవచ్చు. అందుకే పరిమితికి లోబడి కొనుగోలు చేస్తేనే దుబాయ్ బంగారం మీకు ‘లాభదాయకం’.

Follow Us