IRCTC Insurance: కేవలంం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌..!

IRCTC Insurance: గతంలో ఇన్సూరెన్స్ కొనడం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియగా ఉండేది. ఏజెంట్‌ను కలవడం, ఫారాలు నింపడం, ప్రీమియంలను పోల్చడం వంటివి చేయాల్సి వచ్చేది. కానీ కాలం మారింది. మీరు ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు, చెక్అవుట్ పేజీలోనే దానికి జరిగే నష్టం..

IRCTC Insurance: కేవలంం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌..!
Irctc Insurance

Updated on: Jul 08, 2026 | 8:53 AM

IRCTC Insurance: రైలు టిక్కెట్ బుక్ చేసేటప్పుడు, “మీకు ప్రయాణ బీమా కావాలా?” అని రాసి ఉన్న ఒక చిన్న బాక్స్ కనిపించడం మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా మంది ఈ బాక్స్‌ను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతారు. కానీ, ఈ చిన్న బాక్స్‌లో కేవలం 45 పైసలకే రూ. 10 లక్షల వరకు రక్షణ కవచం దాగి ఉందని మీకు తెలుసా? బీమా పరిశ్రమ పరిభాషలో ఈ రకమైన బీమాను “ఎంబెడెడ్ ఇన్సూరెన్స్” అని అంటారు. బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ప్రకారం.. ఈ రోజుల్లో ఏదైనా ఉత్పత్తి లేదా సేవను కొనుగోలు చేసేటప్పుడు, దానితో పాటు బీమా కూడా అందుబాటులో ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు.

ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

గతంలో ఇన్సూరెన్స్ కొనడం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియగా ఉండేది. ఏజెంట్‌ను కలవడం, ఫారాలు నింపడం, ప్రీమియంలను పోల్చడం వంటివి చేయాల్సి వచ్చేది. కానీ కాలం మారింది. మీరు ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు, చెక్అవుట్ పేజీలోనే దానికి జరిగే నష్టం లేదా దొంగతనం నుండి రక్షణ పొందే ఆప్షన్ మీకు లభిస్తుంది. ఈ సౌకర్యం కేవలం ఒక్క క్లిక్‌తో అందుబాటులో ఉంటుంది. రైలు లేదా విమాన టిక్కెట్ బుక్ చేసేటప్పుడు కూడా ఇదే జరుగుతుంది. రైలు టిక్కెట్‌తో మీకు కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి: 6G Service: దేశంలో 6G సేవలు ఎప్పుడు..? కీలక ప్రకటన చేసిన అంబానీ..!

ఇవి కూడా చదవండి

ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుంది?

సాంకేతిక అనుసంధానం కారణంగా ఈ సౌకర్యం సాధ్యమైంది. బీమా కంపెనీలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఏపీఐల ద్వారా ఒకదానికొకటి అనుసంధానించి ఉన్నాయి. దీనివల్ల వినియోగదారులు తక్కువ ధరలకే సులభంగా బీమాను పొందుతున్నారు. IDC నివేదిక ప్రకారం, భారతదేశంలో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2024 సంవత్సరంలోనే స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు 15 కోట్ల యూనిట్లను దాటాయి. దీనితో పాటు ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ మార్కెట్ కూడా అదే స్థాయిలో వృద్ధి చెందుతోంది.

ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ రెండు రకాలు:

  • ఆటోమేటిక్ – బీమా ఉత్పత్తి ధరలోనే చేర్చి ఉంటుంది. వినియోగదారుడు విడిగా ఏమీ ఎంచుకోవాల్సిన అవసరం లేదు.
  • ఐచ్ఛిక ఎంపిక – నామమాత్రపు ప్రీమియం చెల్లించి బీమా తీసుకోవాలా వద్దా అని ఎంచుకునే అవకాశం వినియోగదారునికి లభిస్తుంది.

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే ప్రమాదవశాత్తు జరిగే నష్టం, దొంగతనం, పొడిగించిన వారంటీ వంటి ఫీచర్లతో వస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి స్టోర్లలో కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌ల వంటి పరికరాలకు కూడా ఇలాంటి కవరేజ్ అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: మూడో రోజు పతనమైన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు!

ఇది కూడా చదవండి: RBI: వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. 100 రూపాయల నోట్లపై ఆర్‌బిఐ కీలక హెచ్చరిక జారీ..!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us