Fixed deposits: ఎఫ్‌డీలపై అధిక వడ్డీ కావాలా..? ఆ బ్యాంకులో అదిరే ఆఫర్

భారతదేశంలో ఎఫ్‌డీలు అంటే నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా భావిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులతో పాటు రిటైర్ అయిన వారు పెట్టుబడికి భరోసాతో పాటు నమ్మకమైన రాబడి ఉంటుందని ఎఫ్‌డీల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో ఎఫ్‌డీల కంటే వివిధ పథకాల్లో రాబడి బాగుంటుందని ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వివిధ బ్యాంకులు ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్స్ లాంచ్ చేస్తూ ఇతర బ్యాంకుల కంటే అధిక వడ్డీను అందిస్తున్నాయి. తాాజాగా ప్రముఖ బ్యాంకు అయిన బ్యాంకు ఆఫ్ బరోడా కూడా ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌ల ద్వారా అధిక వడ్డీను ఆఫర్ చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అందించే స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Fixed deposits: ఎఫ్‌డీలపై అధిక వడ్డీ కావాలా..? ఆ బ్యాంకులో అదిరే ఆఫర్
Follow us

|

Updated on: Oct 15, 2024 | 4:31 PM

వివిధ బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్ డీ) పథకాలకు ప్రజల ఆదరణ బాగుంటుంది. డబ్బులు దాచుకోవడానికి సురక్షితమైన, లాభదాయకమైన, రిస్క్ లేని పెట్టుబడి మార్గంగా దీన్ని భావిస్తారు. దానికి అనుగుణంగానే నిర్ణీత కాలానికి అసలు, వడ్డీతో కలిపి డబ్బులు చేతికి వస్తాయి. అన్ని బ్యాంకుల్లోనూ ఎఫ్ డీలపై వడ్డీ రేటు ఓకే విధంగా ఉండదు. బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. అలాగే సాధారణ ఖాతాదారులకు, సీనియర్ సిటిజన్లను తేడా ఉంటుంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు బ్యాంకులు వివిధ వడ్డీరేట్లను ప్రకటిస్తాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ఆఫ్ బరోడా కొత్త ఎఫ్ డీ పథకాన్ని ప్రారంభించింది. అలాగే అధిక వడ్డీ రేటును అందజేస్తోంది. బ్యాంకు ఆఫ్ బరోడా ఇటీవల తన ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీరేట్లను సవరించింది. అలాగే బాబ్ ఉత్సవ్ డిపాజిట్ పథకం పేరిట కొత్త ఎఫ్ డీని తీసుకువచ్చింది. దీని ద్వారా వినియోగదారులకు అధిక వడ్డీరేటును అందిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పథకంలో ఫిక్సడ్ డిపాజిట్ చేసిన సాధారణ పౌరులకు 7.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం వడ్డీని అందిస్తారు.

ఎఫ్ డీలపై వడ్డీరేట్లు

  • బ్యాంకు ఆఫ్ బరోడాలో సవరించిన వడ్డీరేట్ల తర్వాత మూడు కోట్ల రూపాయల లోపు డిపాజిట్లకు ఈ కింద తెలిపిన విధంగా వడ్డీని అందిస్తోంది.
  • 7 రోజుల నుంచి 14 రోజుల వరకూ సాధారణ ఖాతాదారులకు 4.25, సీనియర్ సిటిజన్లకు 4.75, సూపర్ సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం వడ్డీని అందిస్తారు.
  • 46 రోజుల నుంచి 90 రోజుల వరకూ సాధారణ ఖాతాదారులకు 5.5, సీనియర్ సిటిజన్లకు,సూపర్ సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీని ఇస్తారు.
  • ఏడాది డిపాజిట్లకు సాధారణ ఖాతాదారులకు 6.85, సీనియర్ సిటిజన్లకు,సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం వడ్డీని ఇస్తారు.
  • మూడు నుంచి ఐదేళ్ల డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 6.8, సీనియర్ సిటిజన్లకు 7.40, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీని అందిస్తారు.
  • పదేళ్ల లోపు డిపాజిట్లకు సాధారణ ఖాతాదారులకు 6.5, సీనియర్ సిటిజన్లకు 7.50,సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీని అందిస్తారు.

బీఓబీ ఎర్త్ గ్రీన్ డిపాజిట్ పథకం

  • కొత్తగా ప్రారంభించిన బీఓబీ ఎర్త్ గ్రీన్ డిపాజిట్ పథకంలో మూడు కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు బ్యాంకు అందించే వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి.
  • 12 నెలల డిపాజిట్లకు సాధారణ ఖాతాదారులకు 6.8, సీనియర్ సిటిజన్లకు,సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం చొప్పున వడ్డీ ఇస్తారు.
  • 1.5 సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 6.96, సీనియర్ సిటిజన్లకు 7.45, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం వడ్డీ ఇస్తారు.
  • 777 రోజులకు సాధారణ ఖాతాదారులకు 7.1, సీనియర్ సిటిజన్లకు 7.60, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.70 శాతం వడ్డీ అందిస్తారు.
  • 1717 రోజులకు సాధారణ ఖాతాదారులకు 6.75, సీనియర్ సిటిజన్లకు 7.35, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.45 శాతం వడ్డీ ఉంటుంది.
  • 2201 రోజుల డిపాజిట్లకు సాధారణ ఖాతాదారులకు 6.45, సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.45 శాతం వడ్డీ అందిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!
వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!
అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!
అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!
ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్
ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్
అబ్బో.. ఏకంగా రూ.12 లక్షలు సంపాదించేసిందిగా.!
అబ్బో.. ఏకంగా రూ.12 లక్షలు సంపాదించేసిందిగా.!
చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్
చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్
ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.
ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.
వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..
వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..
గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. చేతివాటం చూపించిన దొంగ
గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. చేతివాటం చూపించిన దొంగ
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం
తీవ్ర విషాదం.. దాహం తీర్చాల్సిన నీరే.. ప్రాణం తీసింది.. ఎక్కడంటే
తీవ్ర విషాదం.. దాహం తీర్చాల్సిన నీరే.. ప్రాణం తీసింది.. ఎక్కడంటే