Hyundai motors: భలే మంచి చౌక బేరమూ.. ఐపీవోకు హ్యుందాయ్ మోటార్స్..!

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి దారులందరూ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. దాదాపు మూడు నెలలుగా ఈ రోజు కోసం నిరీక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ సారి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రానున్నది ఆషామాషీ కంపెనీ కంపెనీ కాదు. ప్రజలందరి అభిమానాన్ని పొందిన హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ కావడం విశేషం. ఈ కంపెనీ అక్టోబర్ 15న ఐపీవోకు వచ్చింది.

Hyundai motors: భలే మంచి చౌక బేరమూ.. ఐపీవోకు హ్యుందాయ్ మోటార్స్..!
Hyundai Ipo
Follow us

|

Updated on: Oct 15, 2024 | 4:00 PM

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి దారులందరూ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. దాదాపు మూడు నెలలుగా ఈ రోజు కోసం నిరీక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ సారి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రానున్నది ఆషామాషీ కంపెనీ కంపెనీ కాదు. ప్రజలందరి అభిమానాన్ని పొందిన హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ కావడం విశేషం. ఈ కంపెనీ అక్టోబర్ 15న ఐపీవోకు వచ్చింది. హ్యుందాయ్ మోటార్ గ్రూపులోని భాగమైన హ్యుందాయ్ మోటారు ఇండియా లిమిటెడ్ ను 1996లో స్థాపించారు. ప్రయాణికుల వాహనాల విక్రయంలో ఈ కంపెనీ ప్రపంచంలోనే మూడోస్థానంలో నిలిచింది. నాలుగు చక్రాల పాసింజర్ కార్లతో పాటు ట్రాన్స్ మిషన్లు, ఇంజిన్లు వంటి వాటిని తయారు చేస్తుంది.

నిధుల సమీకరణ

ఐపీవో ద్వారా దాదాపు రూ.28 వేల కోట్లను సమీకరించాలని హ్యుందాయ్ మోటార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో వాటాలను విక్రయిస్తోంది. అక్టోబర్ 15న ప్రారంభమైన ఐపీవో అక్టోబర్ 17 వరకూ కొనసాగుతుంది. 18న షేర్ల కేటాయింపు జరుగుతుంది. 22వ తేదీన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ అవుతుంది. ఐపీవో లో అత్యధిక నిధులు సమకూర్చుకున్న రికార్డు ఎల్ఐసీకి ఉంది. ఆ సంస్థ దాదాపు 21 వేల కోట్లను గతంలో సమకూర్చుకుంది. హ్యుందాయ్ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తే ఎల్ఐసీ రికార్డు బ్రేక్ అవుతుంది.

ధర వివరాలు

ఐపీవో కోసం హ్యుందాయ్ కంపెనీ ప్రైస్ బ్యాండ్ ను నిర్ణయించింది. ఒక్కో షేర్ ను రూ.1,865 నుంచి రూ.1,960 మధ్య సెట్ చేసింది. పెట్టుబడి దారులు కనీసం ఏడు షేర్లను (ఒక లాట్) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం సుమారు రూ.13,720 పెట్టుబడి పెట్టాలి.

ఇవి కూడా చదవండి

ఉద్యోగులకు డిస్కౌంట్

హ్యుందాయ్ ఉద్యోగులు ఐపీవో షేర్లను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. వారు ఐపీవోలో బిడ్డింగ్ వేస్తే ఇష్యూ ధర కంటే దాదాపు రూ.186 తక్కువకు షేర్ ను విక్రయిస్తారు. ఇలా ఉద్యోగుల కోసం 778.400 షేర్లను రిజర్వు చేశారు.

గ్రే మార్కెట్ ప్రీమియం

ఐపీవో లో లిస్టింగ్ కాకముందు, డిమాండ్ ఆధారణంగా గ్రే మార్కెట్ లో ప్రీమియం (జీఎంపీ) ధర నిర్ణయిస్తారు. దానిలో హ్యుందాయ్ షేర్ కేవలం రూ.65 గా ట్రేడ్ అయ్యింది. హ్యుందాయ్ కంపెనీ కి ఆదరణతో పోల్చితే ఇది చాలా తక్కువ. అయితే జీఎంపీ అనేది తరచూ మారుతుందని, తక్కువ ధర పలికిందని ఆందోళన చెందనవసరం లేదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.  హ్యుందాయ్ కంపెనీకి దేశవ్యాప్తంగా 1366 సేల్స్ పాయింట్లు, 1550 సర్వీస్ పాయింట్లు ఉన్నాయి. మార్చి 31 నాటికి ఎగుమతుల రూపంలో 1.2 కోట్ల ప్యాసింజర్ కార్లను విక్రయించింది. ప్రస్తుతం సెడాన్లు, హ్యాచ్ బ్యాక్ లు, ఎస్ యూవీలు, ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్
ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్
అబ్బో.. ఏకంగా రూ.12 లక్షలు సంపాదించేసిందిగా.!
అబ్బో.. ఏకంగా రూ.12 లక్షలు సంపాదించేసిందిగా.!
చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్
చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్
ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.
ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.
వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..
వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..
గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. చేతివాటం చూపించిన దొంగ
గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. చేతివాటం చూపించిన దొంగ
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం
తీవ్ర విషాదం.. దాహం తీర్చాల్సిన నీరే.. ప్రాణం తీసింది.. ఎక్కడంటే
తీవ్ర విషాదం.. దాహం తీర్చాల్సిన నీరే.. ప్రాణం తీసింది.. ఎక్కడంటే
స‌ల్మాన్ తో సాన్నిహిత్యమే.. సిద్ధిఖీ హ‌త్య‌కు దారి తీసిందా ??
స‌ల్మాన్ తో సాన్నిహిత్యమే.. సిద్ధిఖీ హ‌త్య‌కు దారి తీసిందా ??
ఇక్కడ ఆటో సర్వీస్‌ లాగే.. అక్కడ విమాన సర్వీసులు..
ఇక్కడ ఆటో సర్వీస్‌ లాగే.. అక్కడ విమాన సర్వీసులు..