Indian Railways: ఫెస్టివల్ సీజన్‌లో టికెట్ కన్ఫర్మ్ కావాలంటే..? ఈ స్మార్ట్ ట్రిక్స్ ట్రై చేయండి!

పండుగల సమయంలో రైళ్లకు డిమాండ్ సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే పండుగ సీజన్‌లో చాలా రోజులకు ముందే టికెట్లు భర్తీ అయిపోతుంటాయి. ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని రిజర్వేషన్ చేసుకోవడం ద్వారా చివరి నిమిషంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించుకునేందుకు వీలుంటుంది. కన్ఫర్మ్ టికెట్ బుకింగ్ కావాలంటే ఏయే అంశాలను దృష్టిలో పెట్టుకోవాలో ఇక్కడ ఒకసారి పరిశీలించండి.

Indian Railways: ఫెస్టివల్ సీజన్‌లో టికెట్ కన్ఫర్మ్ కావాలంటే..? ఈ స్మార్ట్ ట్రిక్స్ ట్రై చేయండి!
Indian Railways

Updated on: Oct 01, 2026 | 7:42 PM

Indian Railways: దసరా, దీపావళి వంటి పండుగలు సమీపిస్తుండటంతో రైళ్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. సొంతూళ్లకు వెళ్లేందుకు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తుండటంతో ముఖ్యమైన రూట్లలో టికెట్లు త్వరగా నిండిపోతున్నాయి. 2026లో పండుగల సీజన్‌ బుకింగ్స్ (Festival Season 2026) సమయంలో IRCTC ఒక్క రోజులో 20 లక్షలకు పైగా టికెట్లను బుక్ చేసిన సందర్భం కూడా నమోదైంది. కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని రైలు టికెట్ బుకింగ్ చేస్తే.. ఆ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కూడా కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

ముందుగానే టికెట్ బుక్ చేసుకోండి

పండుగల సమయంలో చివరి నిమిషంలో ప్రయాణం ప్లాన్ చేయకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోండి. ప్రయాణ తేదీని ముందుగానే నిర్ణయించుకుని టికెట్ బుక్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ప్రస్తుతం రైల్వే అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) 60 రోజులు. ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు బుకింగ్ ప్రారంభమవుతుంది. 60 రోజులకు ముందు వచ్చే తేదీని గుర్తు పెట్టుకుని మరీ ఆ రోజున టికెట్ బుక్ చేసుకోవాలి.

ఒక్క రైలుపైనే ఆధారపడొద్దు

మీరు వెళ్లాల్సిన మార్గంలో ఒకే రైలును ఎంచుకోవడం కంటే అందుబాటులో ఉన్న ఇతర రైళ్లను కూడా పరిశీలించండి. వేరే సమయాల్లో నడిచే రైళ్లు, ప్రత్యామ్నాయ మార్గాలు, సమీపంలోని స్టేషన్ల నుంచి బయలుదేరే రైళ్లను కూడా చెక్ చేయడం ద్వారా కన్ఫర్మ్ సీటు లభించే అవకాశాలు పెరిగే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

WL, RAC స్టేటస్ గమనించండి

టికెట్ వెంటనే కన్ఫర్మ్ కాకపోయినా వెయిట్‌లిస్ట్ లేదా RACలో ఉండవచ్చు. ప్రయాణ తేదీ దగ్గరపడే కొద్దీ క్యాన్సిలేషన్ల కారణంగా స్టేటస్ మారే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ చార్ట్ తయారయ్యే వరకు టికెట్ స్టేటస్‌ను పరిశీలిస్తూ ఉండాలి. రైల్వే ప్రస్తుతం రిజర్వేషన్ చార్ట్ తయారీ ప్రక్రియలో కూడా మార్పులు చేసింది.

తత్కాల్‌పై ఆధారపడాల్సి వస్తే..

సాధారణ రిజర్వేషన్‌లో టికెట్ దొరకకపోతే అర్హత ఉన్న ప్రయాణికులు తత్కాల్ కోటాను పరిశీలించండి. అయితే పండుగల సమయంలో తత్కాల్ టికెట్లకు కూడా భారీ డిమాండ్ ఉంటుంది. కాబట్టి బుకింగ్ ప్రారంభమయ్యే సమయానికి ముందే ప్రయాణికుల వివరాలు సిద్ధంగా ఉంచుకోవడం, సరైన రైలు-క్లాస్‌ను ముందుగానే నిర్ణయించుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us