AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Pump Profit: పెట్రోల్ పంప్ బిజినెస్ సీక్రెట్స్.. లీటర్ పెట్రోల్‌పై కమిషన్ ఎంత? నెలకు అసలు లాభం ఎంత?

Petrol Pump Profit: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెట్రోల్ పంప్ యజమానులకు (డీలర్లకు) ప్రతి లీటరు అమ్మకంపై నిర్ణీత కమిషన్ (Dealer Commission) అందిస్తాయి. పెట్రోల్‌పై డీలర్‌కు మంచి కమిషన్ లభిస్తుంది. పెట్రోల్ పంప్ అనేది "తక్కువ మార్జిన్ - ఎక్కువ విక్రయాలు..

Petrol Pump Profit: పెట్రోల్ పంప్ బిజినెస్ సీక్రెట్స్.. లీటర్ పెట్రోల్‌పై కమిషన్ ఎంత? నెలకు అసలు లాభం ఎంత?
Petrol Pump Profit
Subhash Goud
|

Updated on: Aug 27, 2026 | 1:27 PM

Share

Petrol Pump Profit: మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటినప్పుడల్లా చాలామంది మనస్సులో ఒకే ఆలోచన వస్తుంది. రూ.100 పెట్రోల్ పోస్తే అందులో పెట్రోల్ 1పంప్ యజమాని ఎంత సంపాదిస్తాడు? అసలు లీటరుకు భారీ లాభాలు వస్తాయా? అని అనుకుంటారు. చాలామంది పెట్రోల్ పంప్ యజమానులకు లీటరుపై రూ.5 నుండి రూ.10 వరకు లాభం వస్తుందేమో అని భావిస్తారు. కానీ అసలు నిజం వేరుగా ఉంది. అయితే పెట్రోల్ మార్కెటింగ్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

రూ.100 పెట్రోల్‌పై కమిషన్ లెక్కలు ఎలా ఉంటాయి?

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెట్రోల్ పంప్ యజమానులకు (డీలర్లకు) ప్రతి లీటరు అమ్మకంపై నిర్ణీత కమిషన్ (Dealer Commission) అందిస్తాయి. పెట్రోల్‌పై డీలర్‌కు లీటరుకు సుమారు రూ.3.14 నుండి రూ.3.50 వరకు కమిషన్ లభిస్తుంది. ఇందులో స్థిరమైన కమిషన్ తో పాటు ప్రాడక్ట్ బిల్లు ధర ఆధారంగా వచ్చే చిన్న శాతం (0.870%) కమిషన్ కూడా కలుస్తుంది. అలాగే డీజిల్ అమ్మకాలపై డీలర్లకు లీటరుకు సుమారు రూ.2.33 నుండి రూ.2.50 వరకు కమిషన్ అందుతుంది. అయితే కమిషన్ లో మార్పులు కూడా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: అంబానీ ఇంట్లో చపాతీలు చేసే హెడ్ చెఫ్ జీతం ఎంతో తెలుసా? ప్యాకేజీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇవి కూడా చదవండి

కమిషన్ మొత్తం యజమాని నికర లాభమా?

కాదు.. యజమానికి వచ్చే కమిషన్ వేరు, నికర లాభం (Net Profit) వేరు. ఒక పెట్రోల్ పంప్‌ను రోజూ నడపాలంటే భారీగా నిర్వహణ ఖర్చులు ఉంటాయి. యజమాని తన కమిషన్ నుండి చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులు ఉంటాయి. అవేంటో చూద్దాం..

పనిచేసే ఉద్యోగుల (సిబ్బంది) నెలవారీ జీతాలు.

  • భారీ విద్యుత్ బిల్లులు, డిజిటల్ చెల్లింపుల (QR / Card Swipe) ఛార్జీలు.
  • పంప్ యంత్రాల నిర్వహణ, ఆయిల్ సర్వీసింగ్ ఖర్చులు.
  • పంప్ భూమి అద్దె, భద్రత, పరిశుభ్రత ఖర్చులు. పెట్రోల్ ఆవిరి కావడం వల్ల జరిగే చిన్నపాటి నష్టం

ఈ అన్ని ఖర్చులనూ మినహాయించిన తర్వాత యజమానికి రూ.100 లీటర్ పెట్రోల్‌పై మిగిలే నికర లాభం కేవలం రూ.1.00 నుండి రూ.1.50 మాత్రమే.

పెట్రోల్ పంప్ యజమానులు అసలు సంపాదన ఎలా?

పెట్రోల్ పంప్ అనేది “తక్కువ మార్జిన్ – ఎక్కువ విక్రయాలు” ఆధారంగా పనిచేసే వ్యాపారం. ఒక లీటరుపై తక్కువ లాభం వచ్చినా, రోజువారీ విక్రయాల పరిమాణం ఆధారంగా యజమాని సంపాదన ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు:

ఒక పెట్రోల్ పంప్‌లో రోజుకు 5,000 లీటర్ల పెట్రోల్ అమ్ముడైతే, డీలర్‌కు వచ్చే మొత్తం కమిషన్ సుమారు రూ.15,700 వరకు ఉంటుంది. నెల మొత్తానికి ఇది దాదాపు రూ.4.70 లక్షల వరకు కమిషన్‌గా మారుతుంది. ఇందులో జీతాలు, కరెంట్ బిల్లులు, ఇతర ఖర్చుల రూపంలో రూ.2 లక్షల నుండి రూ.2.5 లక్షలు పోయినా, యజమానికి నెలకు రూ.2 లక్షలకు పైగా నికర లాభం దక్కుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. అందుకే రోజుకు ఎక్కువ లీటర్ల ఇంధనం అమ్ముడయ్యే హైవేలు లేదా బిజీ సెంటర్లలో ఉండే పంప్ యజమానులు మాత్రమే మంచి లాభాలను పొందగలుగుతారు.

ఇది కూడా చదవండి: Free Treatment: మీకు ఈ కార్డు ఉందా..? హాస్పిటల్‌లో చికిత్స ఖర్చు లక్షల్లో ఉన్నా జీరో బిల్లు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ హీరో సూసైడ్ చేసుకొని చనిపోతాడు.. హీరోయిన్ కూడా..!
ఆ హీరో సూసైడ్ చేసుకొని చనిపోతాడు.. హీరోయిన్ కూడా..!
పెట్రోల్ పంప్ బిజినెస్ సీక్రెట్స్.. లీటర్ పెట్రోల్‌పై కమిషన్ ఎంత?
పెట్రోల్ పంప్ బిజినెస్ సీక్రెట్స్.. లీటర్ పెట్రోల్‌పై కమిషన్ ఎంత?
9 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 41 బంతుల్లో గార్డ్ కొడుకు బీభత్సం..!
9 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 41 బంతుల్లో గార్డ్ కొడుకు బీభత్సం..!
అందమైన పక్షి అనుకుంటే పొరపాటే.. నిలువునా ప్రాణం తీసే కిల్లర్‌!
అందమైన పక్షి అనుకుంటే పొరపాటే.. నిలువునా ప్రాణం తీసే కిల్లర్‌!
బయట జ్యూస్ తాగే ముందు ఒక్కసారి ఇది చూడండి..!
బయట జ్యూస్ తాగే ముందు ఒక్కసారి ఇది చూడండి..!
రాఖీ పండగ మాత్రమే కాదు.. శ్రావణ పౌర్ణమి రోజున జరిగే ఈ గొప్ప వైదిక
రాఖీ పండగ మాత్రమే కాదు.. శ్రావణ పౌర్ణమి రోజున జరిగే ఈ గొప్ప వైదిక
అర్ధరాత్రి బస్సులో మహిళకు షాకింగ్ అనుభవం..
అర్ధరాత్రి బస్సులో మహిళకు షాకింగ్ అనుభవం..
టార్గెట్ ఫిక్స్ చేసుకుని బరిలోకి సై అంటోన్న ముగ్గురు తోపులు..
టార్గెట్ ఫిక్స్ చేసుకుని బరిలోకి సై అంటోన్న ముగ్గురు తోపులు..
కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలనుకునేవారికి ఊహించని షాక్..
కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలనుకునేవారికి ఊహించని షాక్..
మీకు ఈ కార్డు ఉందా? చికిత్స ఖర్చు లక్షల్లో ఉన్నా జీరో బిల్లు..!
మీకు ఈ కార్డు ఉందా? చికిత్స ఖర్చు లక్షల్లో ఉన్నా జీరో బిల్లు..!