Time Deposit Scheme: ఆ పోస్టాఫీస్ పథకంతో ఎఫ్‌డీ కంటే అధిక రాబడి.. పూర్తి వివరాలివే..!

|

Jul 25, 2024 | 5:15 PM

భారతదేశంలో ఇండియన్ పోస్టాపోస్ట్స్ తరతరాలుగా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై అధిక రాబడినిస్తూ ప్రజాదరణ పొందింది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పెట్టుబడిదారులు ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి పథకాల్లో పెట్టుబడిని ఇష్టపడుతున్నారు. సాధారణంగా పోస్టాఫీసులతో పోలిస్తే బ్యాంకు ఎఫ్‌‌డీలు అధిక రాబడినిస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే బ్యాంకుల్లో ఎఫ్‌డీల విషయంలో పెట్టుబడికి భద్రత పోస్టాఫీసులో ఉన్నంత ఉండవు. పోస్టాఫీసుల్లో మన పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంటుంది. అయితే పోస్టాఫీసు పథకాల్లో ఎఫ్‌డీ కంటే అధిక రాబడినిచ్చేలా టైమ్ డిపాజిట్ స్కీమ్ ముందు వరుసలో ఉంటుంది.

Time Deposit Scheme: ఆ పోస్టాఫీస్ పథకంతో ఎఫ్‌డీ కంటే అధిక రాబడి.. పూర్తి వివరాలివే..!
Post Office
Follow us on

భారతదేశంలో ఇండియన్ పోస్టాపోస్ట్స్ తరతరాలుగా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై అధిక రాబడినిస్తూ ప్రజాదరణ పొందింది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పెట్టుబడిదారులు ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి పథకాల్లో పెట్టుబడిని ఇష్టపడుతున్నారు. సాధారణంగా పోస్టాఫీసులతో పోలిస్తే బ్యాంకు ఎఫ్‌‌డీలు అధిక రాబడినిస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే బ్యాంకుల్లో ఎఫ్‌డీల విషయంలో పెట్టుబడికి భద్రత పోస్టాఫీసులో ఉన్నంత ఉండవు. పోస్టాఫీసుల్లో మన పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంటుంది. అయితే పోస్టాఫీసు పథకాల్లో ఎఫ్‌డీ కంటే అధిక రాబడినిచ్చేలా టైమ్ డిపాజిట్ స్కీమ్ ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా ఈ పథకంలో పెట్టుబడిపై రాబడి పొందడమే కాకుండా వడ్డీ కూడా ప్రతి త్రైమాసికం ఆధారంగా చెల్లిస్తారు. అందువల్ల పెట్టుబడిదారునికి అధిక రాబడి వస్తుంది. ఈ నేపథ్యంలో పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో ఎంత పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందో? వంటి కీలక విషయాలను ఓ సారి తెలుసుకుందాం. 

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ వడ్డీ అనేది మనం డిపాజిట్ చేసిన సమయాన్ని ఆధారంగా ఉంటుంది. ఓ సంవత్సరం డిపాజిట్‌పై 6.9 శాతం, రెండు సంవత్సరాల డిపాజిట్‌పై 7.0 శాతం, మూడేళ్లపై 7.1 శాతం, ఐదు సంవత్సరాల డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ అందిస్తారు.  ఈ పథకంలో రూ.5 వేలను సంవత్సారానికి పొదుపు చేస్తే రూ.5354, రెండు సంవత్సారలు డిపాజిట్ చేస్తే రూ.5744, మూడు సంవత్సరాలు డిపాజిట్ చేస్తే 6175, ఐదేళ్లు డిపాజిట్ చేస్తే  రూ.7250 చేతికి వస్తుంది. ఈ రాబడి సంప్రదాయ ఎఫ్‌డీ రాబడి కంటే అధికంగా ఉంటుంది. 

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో రూ. 20 వేలను ఓ ఏడాది సమయానికి డిపాజిట్ చేస్తే రూ.21,416, రెండేళ్లకు డిపాజిట్ చేస్తే రూ.22,978, మూడేళ్లకు డిపాజిట్ చేస్తే 24,701, ఐదేళ్లకు డిపాజిట్ చేస్తే రూ.28,999 రాబడిగా వస్తుంది. అలాగే రూ. లక్షను ఈ పథకంలో ఒక సంవత్సారానికి డిపాజిట్ చేస్తే రూ.1,07,081, రెండేళ్లకు డిపాజిట్ చేస్తే రూ.1,14,888, మూడేళ్లకు డిపాజిట్ చేస్తే రూ.1,23,507, ఐదేళ్లకు డిపాజిట్ చేస్తే రూ.1,44,995 రాబడిగా లభిస్తుంది. అలాగే పోస్టాఫీసులు అనేవి ప్రతి ఊరిలో ఉంటాయని, పెట్టుబడిపై మంచి రాబడితో పాటు పెట్టుబడి హామీ ఉండాలంటే పోస్టాఫీసు పథకాల్లో డిపాజిట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..