భారతదేశంలో ప్రతి ఉద్యోగి రిటైర్‌మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించేందుకు పెట్టుబడి మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ఈపీఎఫ్ పథకం ద్వారా యజమాని, ఉద్యోగి సహకారంతో పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ పథకంలో అధిక వడ్డీ ఆఫర్ చేసినా ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చులకు వచ్చే రాబడికి పొంతన ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ పథకంలో పెట్టుబడిని మార్కెట్ లింక్డ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అధిక రాబడిని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్, ఎన్‌పీఎస్ రెండూ పదవీ విరమణ తర్వాత వ్యక్తులకు ఏకమొత్తంగా లేదా నెలవారీ పెన్షన్ అందించడం లక్ష్యంగా ఉన్నా రాబడి విషయంలో వ్యత్యాసం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ నుంచి ఎన్‌పీఎస్‌కు పెట్టుబడిని ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో? ఓసారి తెలుసుకుందాం.
పీపీఎఫ్ అనేది వడ్డీ రేటు-ఆధారిత గ్యారెంటీ రిటర్న్ పథకమైన ఎన్‌పీఎస్ అనేది మార్కెట్-లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్. ఈ రెండు పథకాల్లో పెట్టుబడి ప్రణాళికలు భిన్నంగా ఉంటాయి. ఎన్‌పీఎస్ మార్కెట్-లింక్డ్ అయినందున ఇది ఈపీఎఫ్ కంటే దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని అందించే అవకాశాలు ఉన్నాయి. ఫిక్స్‌డ్ రిటర్న్ కంటే మార్కెట్-లింక్డ్ రిటర్న్‌లను ఇష్టపడే కొందరు వ్యక్తులు తమ ఈపీఎఫ్ మొత్తాన్ని ఎన్‌పీఎస్‌కి బదిలీ చేయాలనుకోవచ్చు. ఈపీఎఫ్ అనేది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తారు. ఇది ఉద్యోగి ఈపీఎఫ్ సహకారంపై 8.25 శాతం వార్షిక చక్రవడ్డీని అందిస్తుంది. ఒక ఉద్యోగి వారి బేసిక్ జీతం మరియు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)లో గరిష్టంగా 12 శాతం వరకు విరాళంగా ఇవ్వవచ్చు. అయితే యజమాని కూడా ఉద్యోగికి సంబంధించిన ఈపీఎఫ్‌కు సమాన మొత్తాన్ని విరాళంగా అందించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల వరకు ఈపీఎఫ్ డిపాజిట్లకు ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు ఉంటుంది. సంపాదించిన వడ్డీ, అలాగే ఉపసంహరణలు కూడా పన్ను రహితంగా ఉంటాయి
ఎన్‌పీఎస్ అనేది 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా పాన్, బ్యాంక్ వివరాల ద్వారా పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ – సర్వీస్ ప్రొవైడర్స్ లేదా ఈఎన్‌పీఎస్‌ను సందర్శించడం ద్వారా ఎన్‌పీఎస్ ఖాతాను తెరవవచ్చు. ఎన్‌పీఎస్ 60 సంవత్సరాల వయస్సు ఉన్న లాక్-ఇన్ వ్యవధితో టైర్ I ఖాతాను కలిగి ఉంటుంది. అయితే లాక్-ఇన్ వ్యవధి లేని టైర్ II ఖాతాగా వర్గీకరించుకోవచ్చు. రూ. 500 కంట్రిబ్యూషన్, కనీసం రూ. 1,000 సంవత్సరపు సహకారంతో ఎన్‌పిఎస్ టైర్ I ఖాతాను తెరవవచ్చు. 250 రూపాయల సహకారంతో టైర్ II ఖాతాను తెరవవచ్చు. ఆ తర్వాత దానికి కనీస బ్యాలెన్స్ అవసరం లేదు.
టైర్-I ఎన్‌పీఎస్ ఖాతా ఉన్నవారు ఈపీఎఫ్‌ను ఎన్‌పీఎస్‌కు బదిలీ చేయవచ్చు. అయితే ఒకరు బదిలీ అభ్యర్థన ఫారమ్‌ను యజమానికి సమర్పించాల్సి ఉంటుంది. అయితే అప్‌లోడ్ చేస్తున్నప్పుడు రిమార్క్‌లో యజమాని పీఎఫ్/సూపర్ యాన్యుయేషన్ ఫండ్ నుంచి బదిలీని ఎంచుకోవాలి. ప్రైవేట్ ఉద్యోగి కోసం నేమ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్, కలెక్షన్ అకౌంట్-ఎన్‌పీఎస్ ట్రస్ట్ – సబ్‌స్క్రైబర్ పేరు – ప్రాన్‌కి అనుకూలంగా చెక్/డీడీ జారీ చేస్తారు. గుర్తింపు పొందిన పీఎఫ్/సూపర్ యాన్యుయేషన్ ఫండ్ ‘నోడల్ ఆఫీస్ పేరు – యజమాని పేరు – శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (ప్రాన్)’కి అనుకూలంగా చెక్/డీడీను జారీ చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..