Ayushman Bharat: ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ESIలో విలీనానికి ఆమోదం

|

Oct 20, 2024 | 8:37 PM

దేశంలోని ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. ఈ పథకం కింద దేశంలోని 120 మిలియన్ల పేద కుటుంబాలు వైద్య సేవలు పొందుతున్నాయి. ఈ పథకం కింద ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా అందజేస్తారు..

Ayushman Bharat: ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ESIలో విలీనానికి ఆమోదం
Follow us on

ఈఎస్‌ఐపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబాలకు వైద్య సేవలను సులువుగా పొందేందుకు వీలుగా ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనను ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) పథకంతో విలీనానికి కేంద్రం ఆమోదించింది. ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ బెనిఫిట్ కౌన్సిల్ ESI లబ్ధిదారులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించడానికి ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజనతో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను విలీనం చేయడానికి ఆమోదించింది.

ఈఎస్‌ఐ పథకాన్ని ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకంలో విలీనం చేసినట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో రెండు పథకాల లబ్ధిదారులు లబ్ధి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయం తర్వాత ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ESI పథకం లబ్ధిదారులకు కూడా వైద్య చికిత్స లభిస్తుంది. ఆసుపత్రిలో చేరిన సందర్భంలో ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది.

దేశంలోని ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. ఈ పథకం కింద దేశంలోని 120 మిలియన్ల పేద కుటుంబాలు వైద్య సేవలు పొందుతున్నాయి. ఈ పథకం కింద ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా అందజేస్తారు.

ఇవి కూడా చదవండి

ఈఎస్‌ఐ లబ్ధిదారుల కోసం కామన్ సపోర్ట్ మిషన్ (సీఎస్‌ఎం) అమలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. లైఫ్‌స్టైల్ డిజార్డర్‌లను ముందస్తుగా నిర్ధారించడం, బీమా చేయబడిన వ్యక్తులు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తుల మధ్య పోషకాహార లోపాలను గుర్తించడం కోసం వార్షిక నివారణ ఆరోగ్య పరీక్షలు, అవగాహన శిబిరాలను కూడా ఇది తప్పనిసరి చేస్తుంది.

ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) వయస్సు పైబడిన వారందరికీ వర్తిస్తుంది. ప్రధాన్ మంత్రి-జన్ ఆరోగ్య యోజన కింద 12,696 ప్రైవేట్ ఆసుపత్రులతో సహా మొత్తం 29,648 ఆసుపత్రులు, ఈ పథకం కింద ఉచిత లేదా తక్కువ ఖర్చుతో వైద్య సేవలను అందిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి: Ratan TATA: 9000 కోట్లు విరాళంగా ఇచ్చిన రతన్ టాటానే రూ.15 కోట్లు లంచం డిమాండ్ చేశారట.. ఎందుకో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి