Gold Rate in Hyderabad on 20th July 2022: బంగారం ప్రియులకు షాక్! పుత్తడి ధరలు నేడు (జులై 20) భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో నిన్న (మంగళవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,190లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,390లుగా ఉంది. నేటికి బంగారం ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో ఏకంగా 24 క్యారెట్ల బంగారం రూ.120లు, 22 క్యారెట్ల బంగారం రూ.110ల మేర ధరలు పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.50,510లకు చేరుకుంది. అంటే1 గ్రాము 22 క్యారెట్ల బంగారం రూ.4,630లు, 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము రూ.5,510లుగా ఉంది. ఒక్కో గ్రాముకు వరుసగా రూ.11, రూ.12ల మేర ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.
రాష్ట్రాలవారీగా బంగారం ధరలు ఇలా..
దిగొచ్చిన వెండి..
వెండి ధరలు మాత్రం ఈ రోజు కొంత మేర దిగొచ్చాయి. జులై 20న బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.55,600లుఉంది. ఒక గ్రాము వెండి రూ.55.60లుగా ఉండగా, 10 గ్రాముల వెండి ధర రూ.556లు, 100 గ్రాముల వెండి ధర రూ.5,560లుగా ఉంది. నిన్న (మంగళవారం) కేజీ వెండి రూ.56,000లు ఉండగా బుధవారం నాటికి దాదాపు రూ.400ల వరకు వెండి ధరలు పతనమయ్యి, రూ.55,600ల వద్ద కొనసాగుతోంది. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నంలలో కేజీ వెండి రూ.60,700లు పలుకుతోంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.