Gold Price Today: బాబోయ్.. బంగారం.! పండుగ రోజు పైపైకి.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే.?

|

Jan 14, 2025 | 7:32 AM

పండుగొచ్చింది.. బంగారం ధర పెరిగింది.. సంక్రాంతి పండుగ పూట మగువలకు బంగారం షాక్ ఇస్తోంది. గత వారం రోజులుగా బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. మరి హైదరాబాద్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి..

Gold Price Today: బాబోయ్.. బంగారం.! పండుగ రోజు పైపైకి.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే.?
Gold Rates
Follow us on

సంక్రాంతి పండుగ పూట బంగారం ధరలు భారీగా పెరిగాయి. మగువలకు ఏమాత్రం అందకుండా.. గత వారం రోజులుగా పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ సుమారు రూ. 1370 మేరకు పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా ఆర్ధిక విధానాలు ఈ ధరలు పెరుగుదలకు ఒక కారణం కావచ్చునని బిజినెస్ నిపుణులు అంటున్నారు. బంగారం బాటలోనే అటు సిల్వర్ ధరలు కూడా పెరుగుతూపోతున్నాయి. గత రెండు రోజుల్లో కేజీ వెండి ఏకంగా రూ. 1100 పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయ్. మరి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దామా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 73,560 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,230గా ఉంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబై, చెన్నై, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,410గా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,080గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 73,410 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,080గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు..

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి రూ. 94,600గా ఉండగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కేరళ, చెన్నై నగరాల్లో కేజీ వెండి రూ. 1,02,100గా కొనసాగుతోంది. కాగా, పైన పేర్కొన్న ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ గోల్డ్ రేట్స్ కోసం 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి