Gold Price Today: మళ్లీ అదే జోరు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే..

Gold Price Today: మీరు బంగారం కొన్నప్పుడల్లా దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ బంగారం స్వచ్ఛతను ధృవీకరించడానికి హాల్‌మార్క్‌ను ఉపయోగిస్తుంది. ఈ హాల్‌మార్క్ మీ బంగారంలో ఎన్ని క్యారెట్ల బంగారం ఉందో మీకు తెలియజేస్తుంది..

Gold Price Today: మళ్లీ అదే జోరు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే..

Updated on: Nov 01, 2025 | 6:23 AM

Gold Price Today: గత 10 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరల తగ్గుదల శుక్రవారం నుంచి కాస్త బ్రేకులు పడ్డాయ. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,23,290 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,010 వద్ద కొనసాగుతోంది. అయితే ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చుఇక శుక్రవారం ఉదయం 6:30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ (సుమారు 28.34 గ్రాములు) కు $4030.80 (సుమారు రూ. 357,575 ) గా నమోదైంది. ఇది $14.90 పెరిగింది. అయితే, వెండి 0.01% స్వల్పంగా తగ్గింది. వెండి ఔన్స్ కు $48.61 (సుమారు రూ. 4,313 ) వద్ద ట్రేడవుతోంది. అయితే తాజాగా శనివారం నవంబర్‌ 1న కూడా పెరిగిన ధరలతోనే కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రైతులకు గుడ్‌న్యూస్‌.. ఎకరాకు రూ.10 వేలు

ఇవి కూడా చదవండి

శనివారం ధరల వివరాలు:

  1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,440 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,160 వద్ద కొనసాగుతోంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,290 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,010 వద్ద కొనసాగుతోంది.
  3. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,990 వద్ద కొనసాగుతోంది.
  4. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,290 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,010 వద్ద కొనసాగుతోంది.
  5. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,290 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,010 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  1. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,290 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,010 వద్ద కొనసాగుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,290 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,010 వద్ద కొనసాగుతోంది.
  3. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర రూ.1,50,900 వద్ద కొనసాగుతోంది.

అలాగే మీరు బంగారం కొన్నప్పుడల్లా దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ బంగారం స్వచ్ఛతను ధృవీకరించడానికి హాల్‌మార్క్‌ను ఉపయోగిస్తుంది. ఈ హాల్‌మార్క్ మీ బంగారంలో ఎన్ని క్యారెట్ల బంగారం ఉందో మీకు తెలియజేస్తుంది. 24 క్యారెట్ బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముతారు. కొంతమంది 18 క్యారెట్‌ను కూడా ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి: Business Idea: కోటీశ్వరులు కావాలనుకుంటే ఈ మొక్కలను నాటండి.. ఎకరాకు కోటి రూపాయలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి