Gold Price: శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది..!

Gold Price: యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు బంగారం కంటే డాలర్‌ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల డాలర్ విలువ నిరంతరం పెరుగుతోంది. యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. క్రూడ్ ఆయిల్..

Gold Price: శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది..!
Gold Price Today

Updated on: Apr 06, 2026 | 4:34 PM

Gold Price: గత ఒకటిన్నర నెల రోజుల్లో బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుండి ఈ లోహాల ధరల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ లిమిటెడ్ (IBJA) గణాంకాల ప్రకారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

బంగారం ధరలో భారీ క్షీణత

జనవరి 29, 2026: 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,75,340 గా ఉండేది. అదే ఏప్రిల్ 2, 2026 (సాయంత్రం): ఇది రూ. 1,34,293 కి పడిపోయింది. గడిచిన ఈ కాలంలో బంగారం ధర ఏకంగా రూ. 41,047 తగ్గింది. ఇక వెండి ధర విషయానికొస్తే.. దీని ధర రూ. 1.52 లక్షలు డౌన్ అయ్యింది. ఇక జనవరి 29, 2026: కిలో వెండి ధర రూ. 3,79,888 వద్ద ఉండేది. అదే ఏప్రిల్ 2, 2026 నాటికి రూ. 2,27,813 కి చేరుకుంది. ఈ విధంగా చూస్తే వెండి ధరలో మొత్తంగా రూ. 1.52 లక్షల మేర భారీ పతనం నమోదైంది.

ఇది కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో రూ. 4 లక్షల డిపాజిట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత మీ చేతికి ఎంత వస్తుంది?

ఇవి కూడా చదవండి

ఇక తాజా పరిస్థితుల విషయానికొస్తే దేశీయంగా బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు చొటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్‌ 6వ తేదీన తులం పై 1800 వరకు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,130 వద్ద ట్రేడవుతోంది. అదే వెండి కిలోకు రూ.2,50,000 వద్ద ట్రేడవుతోంది. అంటే ఏప్రిల్‌ 2 తర్వాత బంగారం ధరల్లో కొంత పెరుగుదల ఉందనే చెప్పాలి.

గత నెల రోజుల పరిస్థితి

గత నెల రోజుల్లోనే బంగారం ధర 10 గ్రాములకు రూ. 33,178 తగ్గింది. మార్చి 2న బంగారం ధర రూ. 1,67,471 గా ఉండగా, వెండి ధర కిలో రూ. 2,89,848 గా ఉండేది. అప్పటి నుండి వెండి ధరలో కూడా రూ. 62,035 మేర తగ్గుదల కనిపించింది.

ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

బంగారం, వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు:

డాలర్ వైపు మొగ్గు: యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు బంగారం కంటే డాలర్‌ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల డాలర్ విలువ నిరంతరం పెరుగుతోంది. యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

గమనిక: బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉంటాయి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. పైన పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, దీనిని పెట్టుబడి సలహాగా పరిగణించవద్దు.

Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు.. ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us