AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కనకమాలచ్చి దిగొస్తోంది.. బంగారం ధర లక్షకు పడిపోతుందా? బులియన్ మార్కెట్ సంచలన అంచనాలు!

బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయా? 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర లక్షా 10 వేల రూపాయలకు, 22 క్యారెట్ల బంగారం లక్షా 8 వేల రూపాయలకు చేరవచ్చని మార్కెట్ అంచనాలు చెబుతున్నాయి. అమెరికా డాలర్ బలోపేతం, బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు పసిడి ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే 2027లో బంగారం మరింత పెరగవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి.

కనకమాలచ్చి దిగొస్తోంది.. బంగారం ధర లక్షకు పడిపోతుందా? బులియన్ మార్కెట్ సంచలన అంచనాలు!
Gold Price
Shaik Madar Saheb
|

Updated on: Nov 13, 2026 | 6:04 PM

Share

బంగారం ధర లక్షకు దిగుతుందా? సామాన్య, మధ్యతరగతి ఇంట్లో ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. బంగారం ధర లక్ష దాటుతుందని చెప్పిన ఫార్ములానే.. ఇప్పుడు మళ్లీ అదే పసిడి ధర లక్షకు పడిపోతుందని చెబుతోంది. ప్రస్తుతం ఔన్సు బంగారం 3890 డాలర్లుగా ఉంది. ఇది కాస్తా 3100 డాలర్ల వరకు వస్తుందని ఓ అంచనా. అక్కడికి రాగానే.. ఇక కన్సాలిడేట్ అవుతుందంటున్నారు మార్కెట్ నిపుణులు. అంటే, అక్కడిదాకా పడిపోతుందనేది ఓ ఎస్టిమేషన్..

ఇంతకీ.. ఔన్స్ గోల్డ్ 3100 డాలర్లు అంటే ఎంతో తెలుసా.. మన రూపాయల్లో చెప్పాలంటే.. హైదరాబాద్‌ మార్కెట్ రేట్ ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు లక్షా 10వేల రూపాయలను టచ్ చేస్తుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు లక్షా 8000 రూపాయలకు రావొచ్చు. ఒకవేళ డాలర్ మరింత బలపడినా బాండ్ ఈల్డ్స్ పెరిగినా బంగారం ధర ఇంకా తగ్గొచ్చనే గుడ్‌న్యూస్ చెబుతున్నారు నిపుణులు. ఓవరాల్‌గా.. చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఎదురుచూస్తున్న లక్షకు దగ్గరగా రాబోతోంది కనకమాలచ్చి.. బులియన్స్ ఎక్స్‌పర్ట్స్.. గోల్డ్ ట్రెండ్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. వారం రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర సుమారు 6వేల నుంచి 7,500 రూపాయల వరకు తగ్గింది. నవంబర్ 5–6 తేదీల్లో 24 క్యారెట్ల ధర లక్షా 44వేల నుంచి లక్షా 46వేల రూపాయల దగ్గర ఉండేది. ఇప్పుడు లక్షా 38 వేల రూపాయలకు అటు ఇటుగా వచ్చింది. ఈ పతనం కొనసాగితే, చాలామంది ఆశించే లక్షకు దిగే అవకాశం ఉందని మార్కెట్‌లో చర్చ జరుగుతోంది.

సరే.. ఇంతకు గోల్డ్ రేట్ లక్షకు పడిపోవడానికి టెక్నికల్ రీజన్స్ ఏంటి? ఎప్పుడైనా సరే.. బంగారం ధర ఇంటర్నేషనల్ ఎఫైర్స్ కారణంగానే మారుతుంటుంది. ఆ లెక్కన చూస్తే.. బంగారం ధర ఇప్పటికే 4120 డాలర్ల సపోర్ట్ లెవెల్‌ను బ్రేక్ చేసింది. స్పాట్ గోల్డ్ ధర ఇప్పుడు దాదాపు 3వేల 880 నుంచి 3 వేల 950 డాలర్ల దగ్గర ఉంది. టెక్నికల్‌గా ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత ధర మరింత దిగి ఔన్స్ బంగారం ధర 3100 డాలర్లకు పడిపోయే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

ఇలా పడిపోవడానికి ఓ కారణం ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే ఎక్కువగా వచ్చింది. అంటే.. ఫెడరల్ రిజర్వ్ రేట్లు మరింత పెంచే అవకాశం పెరిగింది. అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్ 5 శాతం దాటి పోయింది. ఎలాగూ బంగారం ఏమీ వడ్డీని ఇవ్వదు కాబట్టి.. బాండ్లు 5 శాతం రిటర్న్స్ ఇస్తున్నప్పుడు ఇన్వెస్టర్లంతా బంగారంలో పెట్టిన పెట్టుబడులు అమ్మేసి.. డబ్బు తీసుకెళ్తున్నారు. డాలర్లను తెగ కొంటుండడంతో డాలర్ వాల్యూ బలపడుతోంది. సో, ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే, ఔన్స్ బంగారం ధర మళ్లీ 3100 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే కనకమ్‌ లక్షకు దిగి రావడం గ్యారంటీ అన్న మాట.

ఇదంతా నాణానికి ఒక వైపే.. మరో వైపు ఔన్స్‌ ధర 6300 డాలర్లకు చేరొచ్చన్న అంచనాలున్నాయి. 2027లో పసిడి దూకుడు కొనసాగే అవకాశం ఉందని రీసెర్చ్‌ ఏజెన్సీ JP మోర్గాన్‌ చెబుతోంది.

Follow Us
10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..
10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..
ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..
ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..
ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..
టీమిండియా బ్యాటర్లపై సీరియస్.. గంభీర్‌కు మొదలైన కొత్త టెన్షన్
టీమిండియా బ్యాటర్లపై సీరియస్.. గంభీర్‌కు మొదలైన కొత్త టెన్షన్
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
జబర్దస్త్‌లోకి 'అగ్నిపరీక్ష' రాజకుమారి..ఎవరి టీమ్‌లో చేస్తుందంటే?
జబర్దస్త్‌లోకి 'అగ్నిపరీక్ష' రాజకుమారి..ఎవరి టీమ్‌లో చేస్తుందంటే?
ఇంట్లో అన్నం మిగిలిందా? ఇలా కరకరలాడే వడియాలు తయారు చేసుకోండి!
ఇంట్లో అన్నం మిగిలిందా? ఇలా కరకరలాడే వడియాలు తయారు చేసుకోండి!
ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం..
ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం..
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో