AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసా..?

బంగారం, వెండి రికార్డు ధరలకు చేరుకున్నాయి. గత వారంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం 2025లో 73శాతం వృద్ధి సాధించింది. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో పెట్టుబడిదారులు పసిడిని సురక్షితమైన మార్గంగా చూస్తున్నారు.

Gold Price: వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసా..?
Gold Prices
Krishna S
|

Updated on: Jan 04, 2026 | 5:49 PM

Share

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ భారతీయ స్టాక్ మార్కెట్ 2025లో తన సత్తాను చాటి 2026లోనూ అదే జోరును కొనసాగిస్తోంది. గత వారంలో సెన్సెక్స్ 0.89 శాతం వృద్ధితో 85,762 పాయింట్ల వద్ద స్థిరపడగా, అటు కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సామాన్యులకు షాకిస్తూ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.

పెరుగుతున్న పసిడి సెగ

గడిచిన వారం రోజుల్లోనే దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కేవలం వారం వ్యవధిలో 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ.750, 22 క్యారెట్ల బంగారంపై రూ.760 మేర ధరలు పెరగడం పెట్టుబడిదారుల్లో ఆసక్తిని పెంచుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ నుండి లభిస్తున్న బలమైన మద్దతు. గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,392 డాలర్ల వద్ద సరికొత్త రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. 2025 సంవత్సరంలోనే బంగారం 73 శాతం అద్భుతమైన వృద్ధిని నమోదు చేయగా 2026లోనూ ఈ బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బంగారం కంటే వేగంగా వెండి దూకుడు

పసిడితో పోలిస్తే వెండి ధరలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. గత వారంలోనే కిలో వెండి ధర సుమారు రూ.3,100 పెరిగి, ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,41,000 మార్కును చేరుకుంది. విశేషమేమిటంటే.. ఈ సంవత్సరంలో వెండి ఏకంగా 160 శాతానికి పైగా పెరిగి బంగారం కంటే మెరుగైన రిటర్న్స్‌ను అందించింది.

ఇన్వెస్టర్స్ చూపు అటువైపే..

స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో ఉన్నప్పుడు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అయితే ధరలు నిరంతరం పెరుగుతుండటం వల్ల సామాన్య వినియోగదారులపై భారం పడుతోంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ధరల్లో మరింత మార్పులు ఉండే అవకాశం ఉంది.

ప్రధాన నగరాల్లో (జనవరి 4) బంగారం ధరలు

  • ఢిల్లీ – రూ.1,35,970, 22 క్యారెట్ల ధర – రూ.1,24,650
  • ముంబై – రూ.1,35,820, 22 క్యారెట్ల ధర – రూ.1,24,500
  • చెన్నై రూ.1,37,250, 22 క్యారెట్ల ధర – రూ.1,25,810
  • హైదరాబాద్ రూ.1,35,820, 22 క్యారెట్ల ధర – రూ.1,24,500

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తొలి మ్యాచ్‌లోనే క్లీన్ బౌల్డ్.. చెన్నై ఫ్యాన్స్‌కు షాకిచ్చాడుగా
తొలి మ్యాచ్‌లోనే క్లీన్ బౌల్డ్.. చెన్నై ఫ్యాన్స్‌కు షాకిచ్చాడుగా
సాఫ్ట్‌వేర్,రైల్వే ఉద్యోగుల మత్తు దందా..వెలుగులోకి షాకింగ్ నిజాలు
సాఫ్ట్‌వేర్,రైల్వే ఉద్యోగుల మత్తు దందా..వెలుగులోకి షాకింగ్ నిజాలు
దళపతి విజయ్ ఆస్తులు ఎంతో తెలుసా..?
దళపతి విజయ్ ఆస్తులు ఎంతో తెలుసా..?
సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కాదు..జబర్దస్త్ రిచ్చెస్ట్ కమెడియన్
సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కాదు..జబర్దస్త్ రిచ్చెస్ట్ కమెడియన్
ఛీ..ఛీ..అసలు వీళ్లు గురువులేనా? విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై..
ఛీ..ఛీ..అసలు వీళ్లు గురువులేనా? విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై..
మహిళల ఆరోగ్యానికి ఇవి శ్రీరామ రక్ష.. రోజూ తీసుకుంటే ఊహించని..
మహిళల ఆరోగ్యానికి ఇవి శ్రీరామ రక్ష.. రోజూ తీసుకుంటే ఊహించని..
గ్యాస్ సిలిండర్ తీసుకురాడం లేదని ఆత్మహత్యాయత్నం
గ్యాస్ సిలిండర్ తీసుకురాడం లేదని ఆత్మహత్యాయత్నం
గ్యాస్ దొరకడం లేదని సెల్ టవర్ ఎక్కిన డ్రైవర్లు
గ్యాస్ దొరకడం లేదని సెల్ టవర్ ఎక్కిన డ్రైవర్లు
తెల్ల జుట్టును నల్లగా మార్చే సోంపు మ్యాజిక్! ఇంట్లోనే నేచురల్ డై
తెల్ల జుట్టును నల్లగా మార్చే సోంపు మ్యాజిక్! ఇంట్లోనే నేచురల్ డై
యష్‌ ముందుకొస్తే.. విజయ్‌ వెనక్కి జరుగుతారా ??
యష్‌ ముందుకొస్తే.. విజయ్‌ వెనక్కి జరుగుతారా ??