Gold Silver Price: మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

|

Sep 28, 2022 | 5:20 AM

బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. సాధారణంగా మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు జరుగుతుంటాయి.

Gold Silver Price: మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold Silver Price
Follow us on

బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. సాధారణంగా మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఈ రేట్లు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతాయి. అయితే.. ఇటీవల పెరుగుతన్న బంగారం, వెండి ధరలు తాజాగా తగ్గాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.45,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.200, 24 క్యారెట్లపై రూ.230 మేర ధర తగ్గింది. దేశీయంగా కిలో వెండి రూ. 900 మేర తగ్గి.. రూ.55,400 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 లుగా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290గా కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,020 గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 గా ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,970 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.55,400 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.55,400, చెన్నైలో కిలో వెండి ధర రూ.60,700, బెంగళూరులో రూ.60,700, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,700, విజయవాడలో రూ.60,700, విశాఖపట్నంలో రూ.60,700 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..