Most Expensive Home: భారత్‌లోనే 2వ అత్యంత ఖరీదైన ఇల్లు ఎవరిదో తెలుసా..? ఎక్కడుంది?
Most Expensive Home: దేశంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి చెందిన ముంబైలోని ఆంటిలియా ఇల్లు అగ్రస్థానంలో ఉంది. ఇది కాకుండా, భారతదేశంలోని టాప్-10 ఖరీదైన ఇళ్ల జాబితాలో ఆయన తమ్ముడు అనిల్ అంబానీతో సహా దేశంలోని అనేక పెద్ద పారిశ్రామికవేత్తల విలాసవంతమైన ఇళ్లు..

Most Expensive Home: భారతదేశంలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన భవనం అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది ముఖేశ్ అంబానీకి చెందిన ‘ఆంటిలియా’ (Antilia). అయితే, ఆంటిలియా తర్వాత దేశంలోనే రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు ఏది? దాని విలువ ఎంత? అనే విషయాలు చాలామందికి తెలియవు. ప్రముఖ రేమండ్ గ్రూప్ (Raymond Group) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియాకు చెందిన ‘జెకె హౌస్’ (JK House) భవనమే ఆ ఘనతను సొంతం చేసుకుంది.
దక్షిణ ముంబైలోని అత్యంత ఖరీదైన అల్టామౌంట్ రోడ్‌లో (Altamount Road) ఈ భవనం ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియా కూడా ఈ రోడ్‌లోనే ఉండటం విశేషం.
ఇది కూడా చదవండి: Personal Loan: పర్సనల్ లోన్ త్వరగా క్లోజ్ చేస్తున్నారా? తొందరపడి ఈ పొరపాటు అస్సలు చేయకండి!
జెకె హౌస్’ ప్రత్యేకతలు, సౌకర్యాలు:
- భవనం ఎత్తు, నిర్మాణం: జెకె హౌస్ మొత్తం 37 అంతస్తుల (37 Floors) ఎత్తుతో నిర్మితమైంది. ఆధునిక వాస్తు శిల్ప కళాత్మకతకు ఇది ఒక అద్భుత నిదర్శనం.
- కార్ పార్కింగ్ సామర్థ్యం: గౌతమ్ సింఘానియాకు లగ్జరీ కార్లు అంటే ఎంతో ప్రాణం. అందుకే ఈ భవనంలోని మొదటి 5 అంతస్తులను కేవలం కార్ పార్కింగ్ కోసమే కేటాయించారు.
- హెలిప్యాడ్, స్విమ్మింగ్ పూల్: భవనంపై ప్రైవేట్ హెలిప్యాడ్ సదుపాయం ఉంది. అంతేకాకుండా, అరేబియా సముద్ర అందాలను తిలకించేలా ఓపెన్ స్విమ్మింగ్ పూల్, స్పా, జిమ్, ప్రైవేట్ థియేటర్ వంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయి.
- మ్యూజియం: సింఘానియా కుటుంబానికి చెందిన శతాబ్దాల చరిత్ర, అరుదైన కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు, పాతకాలపు జ్ఞాపకాలను భద్రపరిచేందుకు ఈ భవనంలో ఒక ప్రత్యేకమైన మ్యూజియం అంతస్తును కేటాయించారు.
- విలువ: ప్రస్తుతం ఈ అత్యంత విలాసవంతమైన జెకె హౌస్ విలువ సుమారు రూ.6,000 కోట్లు ఉంటుందని అంచనా.
- వ్యాపార సామ్రాజ్యంలోనే కాకుండా, జీవనశైలి, లగ్జరీ నివాసాల పరంగా కూడా గౌతమ్ సింఘానియా నివాసం నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది.
ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ నివాసం కంటే ఖరీదైనదని చెబుతున్నారు. అనిల్ అంబానీ నివాసం అంచనా వ్యయం రూ. 5,000 కోట్లు. ఈ 17 అంతస్తుల భవనం ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉంది. సుమారు 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఇది కూడా చదవండి: Success Story: రోజుకు రూ.10 కూలీ.. నేడు రూ.681 కోట్ల బిజినెస్! క్లాస్ 6లోనే చదువు మానేసిన వ్యక్తి సక్సెస్ స్టోరీ
ఇది కూడా చదవండి: Success Story: ఒకే దుకాణం.. నాలుగు వ్యాపారాలు.. నెలకు రూ.4 లక్షల ఆదాయం.. గ్రాడ్యుయేట్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




