AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Filing: నిల్‌ రిటర్న్స్‌తో ఫుల్‌గా లాభాలు.. నేడే ఆఖరు తేదీ… త్వరపడాల్సిందే..!

భారత ఆదాయపు పన్ను చట్టం పన్ను చెల్లింపుదారులు వారి మొత్తం ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే సెక్షన్ 87ఏ  కింద రూ. 12,500 రాయితీని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే వారి ఆదాయం రూ.2.5 లక్షల మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ రాయితీ కారణంగా వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ITR Filing: నిల్‌ రిటర్న్స్‌తో ఫుల్‌గా లాభాలు.. నేడే ఆఖరు తేదీ… త్వరపడాల్సిందే..!
Income Tax
Nikhil
|

Updated on: Jul 31, 2023 | 7:30 AM

Share

ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉంటే ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయాల్సిన అవసరం లేదని, ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. భారత ఆదాయపు పన్ను చట్టం పన్ను చెల్లింపుదారులు వారి మొత్తం ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే సెక్షన్ 87ఏ  కింద రూ. 12,500 రాయితీని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే వారి ఆదాయం రూ.2.5 లక్షల మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ రాయితీ కారణంగా వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి నిల్‌ రిటర్న్స్‌ అంటే ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

నిల్‌ రిటర్న్స్‌ అంటే ఏమిటి?

మీ ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే మీకు ఎలాంటి పన్ను బాధ్యత ఉండదు. తద్వారా ఆదాయపు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  “నిల్ రిటర్న్” అనేది అటువంటి ఆదాయపు పన్ను రిటర్న్‌కు పెట్టిన పేరు. నిల్‌ రిటర్న్‌ని ఉపయోగించడం వల్ల ఆ ఆర్థిక సంవత్సరానికి మీకు పన్ను విధించదగిన ఆదాయం లేదని ఆదాయపు పన్ను కార్యాలయానికి తెలియజేయవచ్చు.  అలాంటి వారు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫైల్ చేయాల్సిన అవసరం లేనప్పటికీ అలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

వీరికి నిల్‌ రిటర్న్స్‌ తప్పనిసరి

  • మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఆదాయ రుజువుగా చూపించాలి. ఉదాహరణకు, మీరు వీసా లేదా లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను అందించాల్సి రావచ్చు.
  • మీ ఆదాయం పన్ను విధించదగిన పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఆదాయపు పన్ను ఆదాయ రుజువుగా ఉపయోగపడే అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా లోన్‌ కావాలనుకునే వారు నిల్‌ రిటర్న్స్‌ ఫైల్‌ చేయడం మంచిది.

నిల్‌ రిటర్న్స్‌ ఫైల్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఆదాయ రుజువు

వీసా లేదా రుణం కోసం దరఖాస్తు చేయడం వంటి ప్రయోజనాల కోసం నిల్ రిటర్న్‌ను ఆదాయ రుజువుగా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

చిరునామా రుజువు

పాస్‌పోర్ట్ దరఖాస్తుల ద్వారా చెల్లుబాటు అయ్యే చిరునామా రుజువుగా నిల్ రిటర్న్‌లు అంగీకరిస్తారు. 

టీడీఎస్‌ వాపసును క్లెయిమ్ చేయడం

మీ యజమాని మీ జీతం నుంచి టీడీఎస్‌ను తీసివేసినట్లయితే మీరు నిల్ రిటర్న్ ఫైల్ చేయడం ద్వారా టీడీఎస్‌ వాపసును క్లెయిమ్ చేయవచ్చు.

పన్ను రెసిడెన్సీని స్థాపించడం

నిల్ రిటర్న్‌ను దాఖలు చేయడం వల్ల మీ పన్ను రెసిడెన్సీ స్థితిని స్థాపించడంలో మీకు సహాయపడుతుంది. ఇది పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయడం లేదా వీసా కోసం దరఖాస్తు చేయడం వంటి వాటికి ముఖ్యమైనది.

క్యారీ ఫార్వార్డ్ నష్టాలు

మీరు స్టాక్ మార్కెట్‌లో నష్టాలను చవిచూస్తే, నిల్ రిటర్న్‌ను ఫైల్ చేయడం ద్వారా మీరు వాటిని ముందుకు తీసుకెళ్లవచ్చు.

ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి నేడే ఆఖరు

నిల్ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి నేటితో గడువు ముగుస్తుంది. మీ ఆదాయం 2022–23 ఆర్థిక సంవత్సరానికి పన్ను విధించదగిన పరిమితి కంటే తక్కువగా ఉంటే మీరు జులై 31, 2023లోపు మీ నిల్ రిటర్న్‌ను ఫైల్ చేయాలి. గడువు తేదీ తర్వాత మీరు మీ నిల్ రిటర్న్‌ను ఫైల్ చేస్తే, అది ఆలస్యంగా రిటర్న్‌గా పరిగణిస్తారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బట్టతల చుట్టూ బోలెడు బిజినెస్! ఇది యాపారం భయ్యా!
బట్టతల చుట్టూ బోలెడు బిజినెస్! ఇది యాపారం భయ్యా!
సాధువు వేషం వేసి నకిలీ కొడుకు నాటకం.. చివర్లో సినీ ఫక్కీ ట్విస్ట్
సాధువు వేషం వేసి నకిలీ కొడుకు నాటకం.. చివర్లో సినీ ఫక్కీ ట్విస్ట్
విషాఖ తీరంలో విషాదం.. విహారం కోసమని వెళ్లి ముగ్గురు బాలుర గల్లంతు
విషాఖ తీరంలో విషాదం.. విహారం కోసమని వెళ్లి ముగ్గురు బాలుర గల్లంతు
మళ్లీ థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు'.. అధికారిక ప్రకటన
మళ్లీ థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు'.. అధికారిక ప్రకటన
53ఏళ్లుగా బాపూజీకి భక్తితో నిత్య పూజలు.. ఆ ఊరి జనాలకు ఆయనే దేవుడు
53ఏళ్లుగా బాపూజీకి భక్తితో నిత్య పూజలు.. ఆ ఊరి జనాలకు ఆయనే దేవుడు
గురు భక్తికి కారు బహుమతి.. పూర్వ విద్యార్థుల వినూత్న కానక
గురు భక్తికి కారు బహుమతి.. పూర్వ విద్యార్థుల వినూత్న కానక
రిటైర్మెంట్ ప్రకటించిన యుజ్వేంద్ర చాహల్
రిటైర్మెంట్ ప్రకటించిన యుజ్వేంద్ర చాహల్
మటన్ కర్రీ ఇలా చేశారంటే.. ఇంట్లో అందరి నుంచి కాంప్లిమెంట్స్ పక్కా
మటన్ కర్రీ ఇలా చేశారంటే.. ఇంట్లో అందరి నుంచి కాంప్లిమెంట్స్ పక్కా
పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. రేవంత్ సర్కార్ డెసిషన్..!
పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. రేవంత్ సర్కార్ డెసిషన్..!
‘నాకు పిల్లలు వద్దు..’ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ షాకింగ్ నిర్ణయం
‘నాకు పిల్లలు వద్దు..’ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ షాకింగ్ నిర్ణయం