UPI App: ఇకపై యూపీఐ ద్వారా విదేశీ చెల్లింపులు.. యూపీఐ-పే నౌతో మతిపోయే లాభాలు

|

Jan 13, 2024 | 4:45 PM

2016లో నోట్ల రద్దు తర్వాత నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తీసుకొచ్చిన యూపీఐ చెల్లింపులు అధిక ప్రజాదరణను పొందాయి. ఎన్‌పీసీఐ సహకారంతో వివిధ చెల్లింపు యాప్‌లు భారతదేశంలోని సగటు బ్యాంకు వినియోగదారుడికి అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా యూపీఐ వినియోగదారులకు ఎన్‌పీసీఐ గుడ్‌న్యూస్‌ చెప్పింది. యూపీఐ పే నౌ యాప్‌ ద్వారా భారతీయ వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలకు తక్షణమే నగదు బదిలీ సౌకర్యాన్ని పొందవచ్చని వివరించింది.

UPI App: ఇకపై యూపీఐ ద్వారా విదేశీ చెల్లింపులు.. యూపీఐ-పే నౌతో మతిపోయే లాభాలు
Upi Payments
Follow us on

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా నగదు లావాదేవీలు అనేవి చాలా సరళతరమఅయ్యాయి. భారతదేశంలో అయితే ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ చెల్లింపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా 2016లో నోట్ల రద్దు తర్వాత నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తీసుకొచ్చిన యూపీఐ చెల్లింపులు అధిక ప్రజాదరణను పొందాయి. ఎన్‌పీసీఐ సహకారంతో వివిధ చెల్లింపు యాప్‌లు భారతదేశంలోని సగటు బ్యాంకు వినియోగదారుడికి అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా యూపీఐ వినియోగదారులకు ఎన్‌పీసీఐ గుడ్‌న్యూస్‌ చెప్పింది. యూపీఐ పే నౌ యాప్‌ ద్వారా భారతీయ వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలకు తక్షణమే నగదు బదిలీ సౌకర్యాన్ని పొందవచ్చని వివరించింది. ఈ తాజా సౌకర్యం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్, పే నౌ మధ్య క్రాస్-బోర్డర్ లింక్ ద్వారా ఇకపై సింగపూర్‌లోని భారతీయ ప్రవాసులు ఇప్పుడు నేరుగా భారతీయుల బ్యాంక్ ఖాతాలకు చెల్లింపులను పంపవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సింగపూర్ కౌంటర్ లీ హ్సీన్ లూంగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా యూపీఐ, పే నౌ మధ్య సరిహద్దు కనెక్టివిటీని ప్రారంభించారు. ఈ సదుపాయం తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని బీమ్‌, ఫోన్‌ పే, పేటీఎం యాప్‌ల వినియోగదారులు యాక్సెస్ చేయవచ్చు. అదనంగా యాక్సిస్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు తమ తమ యాప్‌ల ద్వారా ఈ కార్యాచరణను అందజేస్తాయని ఎన్‌పీసీఐ తెలిపింది.

అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్‌లలో త్వరలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

యూపీఐ-పే నౌ ప్రయోజనాలు

  • నిధులు రియల్‌టైమ్‌లో బదిలీ అవుతాయి. గ్రహీతకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలో నిధులు సెకన్లలో చేరుతాయి.
  • సురక్షితమైన, విశ్వసనీయ లావాదేవీలను నిర్ధారించడానికి ఈ అనుసంధానం బలమైన భద్రతా ప్రోటోకాల్‌లను ఉపయోగిస్తుంది.
  • లావాదేవీ రుసుములు నామమాత్రంగా ఉంటాయిముఖ్యంగా చిన్న చెల్లింపులకు ఈ చెల్లింపు ప్రక్రియ అనువుగా ఉంటుంది. 
  • ఈ సౌకర్యం సంవత్సరంలో 24/7, 365 రోజులు అందుబాటులో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..