AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Black: అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ అదిరే ప్లాన్.. యూట్యూబ్‌లో ఆ యాక్సెస్ ఫ్రీ.. సూపర్ డిస్కౌంట్స్..

ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే తన కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌ను ప్రారంభించింది. అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా దీనిని తీసుకొచ్చింది. దీన్ని ధర ఎంత.. ? ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే ఏంట లాభం..? వంటి విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Flipkart Black: అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ అదిరే ప్లాన్.. యూట్యూబ్‌లో ఆ యాక్సెస్ ఫ్రీ.. సూపర్ డిస్కౌంట్స్..
Flipkart Black
Krishna S
|

Updated on: Aug 26, 2025 | 7:10 AM

Share

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్ల కోసం ఒక కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ పేరుతో వస్తున్నఈ ప్లాన్.. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్, ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్ వీఐపీ, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లాయల్టీ ప్రోగ్రామ్‌ల కంటే మరింత ప్రీమియం ప్రయోజనాలను అందిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ప్రయోజనాలు:

ప్రత్యేక ప్రయోజనాలు:

  • సేల్స్ సమయంలో ముందుగానే యాక్సెస్.
  • ప్రాధాన్యతతో కూడిన కస్టమర్ సపోర్ట్.
  • కొన్ని వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్లు.

సూపర్‌కాయిన్ క్యాష్‌బ్యాక్:

  • ఫ్లిప్‌కార్ట్ దాని క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌లో చేసే ప్రతి ఆర్డర్‌పై 5శాతం సూపర్‌కాయిన్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
  • సభ్యులు నెలకు గరిష్టంగా 800 సూపర్‌కాయిన్‌లను సంపాదించవచ్చు.
  • సూపర్‌కాయిన్ అనేది ఫ్లిప్‌కార్ట్ రివార్డ్ కరెన్సీ, దీని విలువ ఒక రూపాయికి సమానం. ఉదాహరణకు 50 సూపర్‌కాయిన్‌లు అంటే రూ. 50 డిస్కౌంట్.

యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వినియోగదారులకు ఒక సంవత్సరం పాటు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా యాడ్స్ లేకుండా వీడియోలు చూడొచ్చు. యూట్యూబ్ ప్రీమియం వార్షిక ప్లాన్ ధర సుమారుగా రూ. 1490గా ఉంది. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్‌లో ఒక పెద్ద ఆకర్షణ.

ధర ఎంతంటే..?

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్‌షిప్ సాధారణ ధర సంవత్సరానికి రూ. 1499. కానీ పరిమిత కాలం ఆఫర్ కింద దీన్ని రూ. 990కి పొందవచ్చు. దీంతో పోలిస్తే ఫ్లిప్‌కార్ట్ వీఐపీ మెంబర్‌షిప్ ధర ఏడాదికి రూ. 799. అంటే, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ కోసం దాదాపు రెట్టింపు ఖర్చు చేయాలి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ అనేది ఆర్డర్ల సంఖ్య ఆధారంగా లభిస్తుంది. ఒక సంవత్సరంలో 10 ఆర్డర్లు చేస్తే ప్లస్ సిల్వర్ మెంబర్‌షిప్, 20 కంటే ఎక్కువ ఆర్డర్లు చేస్తే ప్లస్ గోల్డ్ మెంబర్‌షిప్ యాక్టివేట్ అవుతుంది.

మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ కోసం చెల్లించిన తర్వాత, దాన్ని రద్దు చేయడానికి లేదా డబ్బును తిరిగి పొందడానికి అవకాశం లేదు. ఈ కొత్త ప్రోగ్రామ్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ తమ ప్రీమియం కస్టమర్ బేస్‌ను మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..