Fact Check: వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న రూ.500 నకిలీ నోటు.. ఇందులో నిజమెంత.. క్లారిటీ ఇచ్చిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో

|

Dec 28, 2021 | 5:43 PM

Fact Check: సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే అంశాలన్ని ఎక్కువ శాతం ఫేక్‌ ఉంటాయి. వాటిని నమ్మి చాలా మంది ఆందోళనకు గురవుతుంటారు. ఇప్పటికే సోషల్‌ మీడియా..

Fact Check: వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న రూ.500 నకిలీ నోటు.. ఇందులో నిజమెంత.. క్లారిటీ ఇచ్చిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో
Follow us on

Fact Check: సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే అంశాలన్ని ఎక్కువ శాతం ఫేక్‌ ఉంటాయి. వాటిని నమ్మి చాలా మంది ఆందోళనకు గురవుతుంటారు. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా, ఎన్నో వీడియోలో, ఫోటోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిని చూసిన జనాలు నిజమని టెన్షన్ పడుతుంటారు. ఇక తాజాగా భారత కరెన్సీ విషయంలో ఇదే జరుగుతోంది. ఇక తాజాగా రూ. 500 నోటుకు సంబంధించిన ఓ పోస్టు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియాలలో వైరల్‌ అవుతోంది. 500 రూపాయల నోటు మీద ఫేక్‌ ప్రచారం జరుగుతోంది. దీనిని చూసిన వ్యాపారస్తులు, జనాలను ఆందోళనకు గురి చేస్తోంది. రూ.500 నోటుపై ఆకు పచ్చ రంగులో ఉండే మెరుపు తీగ .. (సెక్యురిటీ థ్రెడ్), ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరగా కాకుండా మహాత్మా గాంధీ బొమ్మకు దగ్గరగా ఉంటే ఆ నోటు చెల్లదు అని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆర్బీఐ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఆ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ అయ్యాయంటూ ఓ వీడియో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో వైరల్‌ అవుతోంది. దీంతో 500 రూపాయల నోటు తీసుకునేందుకు వ్యాపారులు వణికిపోతున్నారు

వైరల్‌ అవుతున్న నోట్‌పై ప్రభుత్వ సమాచార విభాగం, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB- Press Information Bureau  క్లారిటీ ఇచ్చింది. రెండు కరెన్సీ నోట్ల చిత్రాలతో కూడిన వైరల్‌ అవుతున్న మెసేజ్‌లపై ఆందోళన చెందవద్దని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

అయితే ఈ నోట్లపై ఉండే గ్రీన్‌ స్ట్రిప్‌ ఆర్బీఐ గవర్నర్‌ సంతకానికి దగ్గరిగా కాకుండా గాంధీ బొమ్మకు దగ్గరగా ఉండే ఆ నోటు చెల్లదని జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని తెలిపింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో తెలిపింది. అలాగే రెండు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు చేసింది పీఎన్‌బీ.

అసలైన రూ.500 నోటును గుర్తించడం ఎలా..?

ఈ రూ.500 నోటులో కొన్ని గుర్తులను గుర్తించడం వల్ల నకిలీ నోటా.. అసలు నోటా అనేది గుర్తించవచ్చు.

► కరెన్సీ నోటు ముందు వైపు ఎడమవైపు అడ్డంగా 500 నెంబర్ కనిపిస్తుంటుంది.
► దాని పక్కనే 500 నెంబర్ కనిపించకుండా ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే తప్ప అది కనిపించదు.
► రెండో గుర్తు పైన దేవనాగరి లిపిలో రూ.500 అని కనిపిస్తుంది.
► కరెన్సీ నోటు మధ్యలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది.
► మహాత్మాగాంధీ చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే హిందీలో భారత్, ఇంగ్లీష్‌లో India అనే పదాలు కనిపిస్తాయి.
► మహాత్మాగాంధీ చిత్రం పక్కన సెక్యూరిటీ త్రెడ్ అనేది ఉంటుంది. అందులో భారత్ అని హిందీలో, RBI, 500 అని కనిపిస్తుంటాయి.
► సెక్యూరిటీ త్రెడ్ పక్కన ఆర్‌బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. సంతకం కింద ఆర్‌బీఐ ఎంబ్లమ్ ఉంటుంది.
► ఆ పక్కన ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అందులో మహాత్మాగాంధీ చిత్రంతో పాటు 500 నెంబర్ వాటర్‌మార్క్‌లాగా ఉంటుంది. కాస్త వెలుతురులో పెట్టి చూస్తే ఈ గుర్తులు కనిపిస్తాయి.
► రూ.500 నోటులో కుడివైపు కింద కరెన్సీ నోట్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ సైజు చిన్న నుంచి పెద్దగా ఉంటుంది.
► కరెన్సీ నోటు సీరియల్ నెంబర్ పైన రూపీ గుర్తు, 500 నెంబర్‌తో ₹500 కనిపిస్తుంది.
► రూ.500 నోటులో కుడివైపు కింద అశోక స్తంభం కనిపిస్తుంది.
► అంధులు కరెన్సీ నోటును గుర్తించేందుకు నల్లని లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ రెండువైపులా కనిపిస్తాయి.
► కరెన్సీ నోటు వెనుక వైపు ఎడమవైపు కరెన్సీ నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది.
► లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది. ఇందులో తెలుగు సహా 15 భాషల్లో రెండు వేల రూపాయలు అని రాసి ఉంటుంది.
► మధ్యలో ఎర్రకోట చిత్రం ఉంటుంది.
► ఎడమవైపు పైన దేవనాగరి లిపిలో ₹500 అని కనిపిస్తుంది.

 

ఇవి కూడా చదవండి:

Year Ender 2021: ఈ ఏడాదిలో సురక్షితమైన టాప్‌ -9 కార్లు ఇవే.. ఫీచర్స్‌, ధర, ఇతర వివరాలు

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ న్యూ ఇయర్‌ టూర్‌ ప్యాకేజీ.. డిసెంబర్‌ 29 నుంచి ప్రారంభం.. ఎక్కడెక్కడ అంటే..!