AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Cars: ఈ ఎలక్ట్రిక్‌కార్లు కొనాలంటే డెలివరీ కోసం 6 నెలలు ఆగాల్సిందే.. వీటికి అంత డిమాండ్‌ ఎందుకు?

Electric Cars: మీరు రాబోయే రోజుల్లో లేదా పండుగల సమయంలో ఈ రెండు కార్లలో ఏదైనా ఒకదానిని ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, చివరి నిమిషం వరకు ఆగకుండా ముందే డీలర్‌షిప్‌ను సంప్రదించి బుకింగ్ చేసుకోవడం మంచిది. అలాగే మీ సమీపంలోని అధీకృత టాటా మోటార్స్ షోరూమ్‌లో బుకింగ్..

Electric Cars: ఈ ఎలక్ట్రిక్‌కార్లు కొనాలంటే డెలివరీ కోసం 6 నెలలు ఆగాల్సిందే.. వీటికి అంత డిమాండ్‌ ఎందుకు?
Electric Cars
Subhash Goud
|

Updated on: Aug 27, 2026 | 3:00 PM

Share

Electric Cars: భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టాటా నుంచి వచ్చిన ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ కార్లయిన టాటా టియాగో ఈవీ (Tata Tiago EV), టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) మోడళ్లకు కస్టమర్ల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. అయితే ఈ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో డెలివరీ టైమ్ (Waiting Period) భారీగా పెరిగింది. ఈ కార్లను సొంతం చేసుకోవడానికి కొనుగోలుదారులు ఏకంగా 24 వారాల (సుమారు 6 నెలల) వరకు వేచి చూడాల్సి వస్తోంది.

ఇది కూడా చదవండి: House Construction: 100 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎంత సిమెంట్, స్టీల్, ఇసుక, ఇటుకలు కావాలి? పూర్తి మెటీరియల్ లిస్ట్ ఇదే!

ఏ మోడల్‌కు ఎంత వెయిటింగ్ పీరియడ్?

కార్ మోడల్, వేరియంట్, మీరు ఉండే నగరాన్ని బట్టి ఈ వెయిటింగ్ పీరియడ్ వ్యవధి మారుతుంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సమాచారం ప్రకారం వివరాలు ఇవే:

టాటా పంచ్ ఈవీ (Tata Punch EV):

టాటా పంచ్ ఈవీకి ప్రస్తుతం అత్యంత ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. వేరియంట్ ఆధారంగా ఈ కారు డెలివరీకి 12 వారాల నుండి 24 వారాల వరకు సమయం పడుతోంది. పండగల సీజన్ ప్రభావం, సరఫరా సమస్యల వల్ల కొన్ని నిర్దిష్ట రంగులు, టాప్-ఎండ్ వేరియంట్లకు మరింత ఆలస్యం అవుతోంది.

టాటా టియాగో ఈవీ (Tata Tiago EV):

భారతదేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన టియాగో ఈవీకి కూడా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ కారు కొనుగోలు చేసిన వారికి బుకింగ్ చేసిన తేదీ నుండి 8 వారాల నుండి 16 వారాల వరకు (సుమారు 2 నుండి 4 నెలలు) వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది.

డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలు:

పొదుపు, అందుబాటులో ఉన్న ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రోజువారీ ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవడానికి చాలామంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు.

అద్భుతమైన రేంజ్, ఫీచర్లు: పట్టణ ప్రయాణాలకు, దైనందిన అవసరాలకు తగినంత బ్యాటరీ రేంజ్, ఆధునిక సాంకేతిక ఫీచర్లు ఈ కార్లలో అందుబాటులో ఉండడం.

సేఫ్టీ రేటింగ్స్: టాటా వాహనాల పట్ల కొనుగోలుదారుల్లో ఉన్న నమ్మకం, వాటికి లభించిన ఉత్తమ క్రష్ టెస్ట్ రేటింగ్స్.

కొనుగోలుదారులకు నిపుణుల సూచన:

మీరు రాబోయే రోజుల్లో లేదా పండుగల సమయంలో ఈ రెండు కార్లలో ఏదైనా ఒకదానిని ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, చివరి నిమిషం వరకు ఆగకుండా ముందే డీలర్‌షిప్‌ను సంప్రదించి బుకింగ్ చేసుకోవడం మంచిది. అలాగే మీ సమీపంలోని అధీకృత టాటా మోటార్స్ షోరూమ్‌లో బుకింగ్ చేసుకునే సమయంలోనే కచ్చితమైన డెలివరీ సమయం గురించి ఆరా తీయడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి: Success Story: ఒకే దుకాణం.. నాలుగు వ్యాపారాలు.. నెలకు రూ.4 లక్షల ఆదాయం.. గ్రాడ్యుయేట్ సక్సెస్ సీక్రెట్ ఇదే!

ఇది కూడా చదవండి: House Build: ఈ మూడు రోజులలో ఇంటి నిర్మాణం చేస్తే ధనవంతులు అవుతారు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us