AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు తెలుసుకోండి..

ఈ ఆధునిక యుగంలో ప్రతి ఇంట్లో కరెంట్ మీటర్లు పరుగులు తీస్తుంటాయి. ఈ క్రమంలో బిల్లును తగ్గించుకోవాలనే ఆలోచనతో చాలామంది ఫ్యాన్ స్పీడ్‌ను 5 నుంచి 1 లేదా 2కి మారుస్తుంటారు. అయితే వేగం తగ్గించినంత మాత్రాన నిజంగానే విద్యుత్ ఆదా అవుతుందా? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అసలు నిజాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు తెలుసుకోండి..
Does Reducing Fan Speed Really Save Electricity
Krishna S
|

Updated on: Aug 19, 2026 | 7:59 PM

Share

కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు తిరగడం కామన్. చాలామంది కరెంట్ బిల్లు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఫ్యాన్‌ను 5వ నంబర్ నుంచి 1 లేదా 2వ నంబర్‌కు తగ్గిస్తుంటారు. అయితే వేగం తగ్గించినంత మాత్రాన నిజంగానే విద్యుత్ ఆదా అవుతుందా? లేక ఇదొక అపోహ మాత్రమేనా? అనే డౌట్లు చాలా మందిలో ఉంటాయి. గతంలో ఇళ్లలో పెద్ద సైజులో ఉండే రెసిస్టర్ ఆధారిత రెగ్యులేటర్లను వాడేవారు. ఈ సాంకేతికతలో ఫ్యాన్ స్పీడ్ తగ్గించినప్పుడు, మోటార్‌కు వెళ్లే వోల్టేజ్‌ను తగ్గించడానికి రెగ్యులేటర్ మిగిలిన విద్యుత్‌ను వేడి రూపంలోకి మార్చి బయటకు విడుదల చేస్తుంది. అంటే ఫ్యాన్ 5లో తిరిగినా, 1లో తిరిగినా విద్యుత్ వినియోగం దాదాపు ఒకేలా ఉంటుంది. కాబట్టి పాత రెగ్యులేటర్లు ఉన్న ఫ్యాన్ల స్పీడ్ తగ్గించినా కరెంట్ అస్సలు ఆదా కాదు.

ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లతోనే ఆదా సాధ్యం

ప్రస్తుతం వస్తున్న ఆధునిక ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లు కెపాసిటర్ లేదా ట్రయాక్ ఆధారిత సాంకేతికతతో పనిచేస్తాయి. ఇవి వేడిని ఉత్పత్తి చేయకుండా, నేరుగా మోటార్‌కి వెళ్లే విద్యుత్ ప్రవాహ తరంగాలను నియంత్రిస్తాయి. ఫలితంగా ఫ్యాన్‌ను 1 లేదా 2వ స్పీడ్‌లో నడిపినప్పుడు విద్యుత్ వినియోగం తగ్గుతుంది. పాత రెగ్యులేటర్లతో పోలిస్తే ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్ల ద్వారా దాదాపు 20 నుంచి 30శాతం వరకు విద్యుత్‌ను ఆదా చేయవచ్చు.

గేమ్‌ ఛేంజర్ – BLDC ఫ్యాన్లు

కరెంట్ బిల్లులను భారీగా తగ్గించుకోవాలనుకునే వారికి BLDC ఫ్యాన్లు అద్భుతమైన ప్రత్యామ్నాయం. సాధారణ ఫ్యాన్లు పూర్తి వేగంతో నడిచేటప్పుడు సుమారు 70 నుంచి 80 వాట్ల విద్యుత్‌ను వినియోగిస్తాయి. BLDC ఫ్యాన్లు అధునాతన మైక్రోకంట్రోలర్ ఆధారంగా పనిచేస్తూ, పూర్తి స్పీడ్‌లో నడిచినా కేవలం 28 నుంచి 35 వాట్లు మాత్రమే తీసుకుంటాయి. ఇవి రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తాయి కాబట్టి స్పీడ్ 1 లేదా 2కి తగ్గించినప్పుడు విద్యుత్ వినియోగం కేవలం 6 నుంచి 10 వాట్లకు పడిపోతుంది.

ఫ్యాన్ స్పీడ్ సగానికి తగ్గిస్తే బిల్లు కూడా సగానికి తగ్గుతుందా?

వేగాన్ని సగానికి తగ్గించినంత మాత్రాన కరెంట్ వినియోగం సరిగ్గా 50శాతానికి తగ్గుతుందని భావించలేం. విద్యుత్ ఆదా అనేది మీరు వాడే మోటార్ రకం, రెగ్యులేటర్ సామర్థ్యం మరియు రోజూ ఫ్యాన్ తిరిగే గంటలపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ఇంట్లో పాత రెసిస్టర్ రెగ్యులేటర్లు ఉంటే వెంటనే వాటిని తొలగించి ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లను అమర్చడం లేదా BLDC ఫ్యాన్లను ఎంచుకోవడం ద్వారా నెలాఖరున కరెంట్ బిల్లులను గణనీయంగా ఆదా చేసుకోవచ్చు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర