Salary tips: జీతం గురించి మాట్లాడటానికి జంకుతున్నారా..? ఫ్రెషర్ల కోసం నిపుణులు చెబుతున్న టిప్స్ ఇవే..!

|

Sep 20, 2024 | 4:45 PM

చదువు పూర్తి చేసుకుని యువత తమ డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఉద్యోగాల కోసం అన్వేషణ సాగిస్తారు. వివిధ కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళతారు. అక్కడ ఆయా కంపెనీలకు చెందిన హెచ్ఆర్ లు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఈ సమయంలో యువతకు హెచ్ ఆర్ లతో ఎలా మాట్లాడాలి, ఏ విషయాల గురించి ప్రస్తావించాలో తెలియదు. తమకు అనుభవం లేదు కాబట్టి జీతం ఎక్కువ డిమాండ్ చేయకూడదని భావిస్తారు. సరైన ప్రణాళికతో తాజా గ్రాడ్యుయేట్లు కూడా మెరుగైన వేతనం, ప్రయోజనాలు పొందగలరు.

Salary tips: జీతం గురించి మాట్లాడటానికి జంకుతున్నారా..? ఫ్రెషర్ల కోసం నిపుణులు చెబుతున్న టిప్స్ ఇవే..!
Salary Negotiation
Follow us on

చదువు పూర్తి చేసుకుని యువత తమ డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఉద్యోగాల కోసం అన్వేషణ సాగిస్తారు. వివిధ కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళతారు. అక్కడ ఆయా కంపెనీలకు చెందిన హెచ్ఆర్ లు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఈ సమయంలో యువతకు హెచ్ ఆర్ లతో ఎలా మాట్లాడాలి, ఏ విషయాల గురించి ప్రస్తావించాలో తెలియదు. తమకు అనుభవం లేదు కాబట్టి జీతం ఎక్కువ డిమాండ్ చేయకూడదని భావిస్తారు. సరైన ప్రణాళికతో తాజా గ్రాడ్యుయేట్లు కూడా మెరుగైన వేతనం, ప్రయోజనాలు పొందగలరు. ఈ నేపథ్యంలో ఫ్రెషర్లు హెచ్ ఆర్ తో జీతం గురించి ఎలా చర్చించాలనే అంశాలపై నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో? ఓసారి తెలుసుకుందాం.

జీతం కోసం చర్చించడం అంటే కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు. మీ సామర్థ్యాన్ని తెలియజేయడం, మీ వ్యూహాలు చెప్పడంలా కూడా భావించవచ్చు. కొత్తగా వృత్తిలో ప్రవేశించేవారు మార్కెట్ విలువను ప్రతిబింబించేలా ప్యాకేజీని డిమాండ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా  పరిశ్రమ ప్రమాణాల గురించి ఫ్రెషర్లు బాగా తెలుసుకోవాలి. వారి ఉద్యోగ పాత్ర, రంగం, స్థానం, ఉన్నతిపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  ప్రారంభ జీతం గురించి చర్చలు జరపడం అనేది మీ విలువను గుర్తింపు, మీ కెరీర్‌కు బలమైన పునాదిని ఏర్పర్చుకోవడానికి ఉపయోపడుతుంది. చాలా మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు చర్చలు జరపడానికి వెనుకాడతారు. దాని వల్ల తమకు ఉద్యోగ అవకాశం పోతుందని భావిస్తారు. తమకు అనుభవం లేకపోవడంతో ఎక్కువ జీతం అడగడానికి వెనకడుగు వేస్తారు. వాస్తవానికి అభ్యర్థులు తమకు తాముగా వాదించాలని యజమానులు ఆశిస్తారు. దాని ద్వారా వారు పనిలో వారి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి వీలుంటుంది. జీతం గురించి చర్చించే ముందు పరిశ్రమ, ప్రస్తుత జీతం ట్రెండ్‌లను పరిశోధించాలి. ముఖ్యంగా మార్కెట్ సగటును అర్థం చేసుకోవడం ఉత్తమం. మీ నైపుణ్యాలు, చదువు, ప్రత్యేక అనుభవాలు కంపెనీ అవసరాలకు ఎలా సరిపోతాయో పరిశీలించాలి. వీటితో పాటు ఇంటర్న్‌షిప్‌లు,కమ్యూనికేషన్, టీమ్‌వర్క్ తదితర సాఫ్ట్ స్కిల్స్ మీకు అదనపు బలంగా మారతాయి.

జీతం గురించి మీరు జరిపే చర్చలు డిమాండ్ చేసినట్టు కాకుండా, మార్కెట్ డేటా, వ్యక్తిగత సామర్థ్యం ఆధారంగా ఉండాలి. ఫ్రెషర్లు తాము అనుకున్న జీతం అంచనాలను అందుకోలేదని భావిస్తే, ప్రత్యామ్నాయ విధానాలను అన్వేషించాలి. ప్యాకేజీలో భాగంగా యజమానులు వృద్ధి అవకాశాలు, వృత్తిపరమైన అభివృద్ధి, ద్రవ్యేతర ప్రయోజనాలను ఎక్కువగా అందిస్తున్నారు. ఫ్రెషర్లు కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి అనుమతించే ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ ప్లాన్‌లు (ఈఎస్వోపీలు) వంటి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే పనితీరుకు అందించే బోనస్‌లు, ప్రొబేషన్, కన్ఫర్మేషన్లపై అవగాహన పెంచుకోవాలి. దీనివల్ల ఫ్రెషర్లు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. అనువైన పని గంటలు, ఆరోగ్య బీమా, ఇతర ప్రోత్సాహకాలు కూడా చాలా అవసరం. మొదటి ఆఫర్ అనేది కెరీర్ ప్రారంభానికి ఒక మెట్టు మాత్రమే. గ్రోత్ మైండ్‌సెట్‌ను ప్రదర్శించడం ద్వారా, ఫ్రెషర్లు కేవలం ఆర్థిక రివార్డులకు మాత్రమే కాకుండా దీర్ఘకాలిక కెరీర్‌లో పురోగతి అవకాశాలను అందుకోగలరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..