AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: మీతో పాటు ట్రైన్ కోచ్‌లోకి సైకిల్ తీసుకెళ్లవచ్చా..? ఈ రూల్స్ తెలియకపోతే భారీగా పెనాల్టీ..

రైల్వే కోచుల్లోకి కొన్ని సామాన్లను తీసుకెళ్లడం కుదరదు. కొంతమందికి తెలియక ఏవి పడితే అవి తీసుకెళుతూ ఉంటారు. ఇలాంటప్పుడు రైల్వే అధికారులు భారీగా జరిమానాలు విధిస్తూ ఉంటారు. దీంతో మీరు ట్రైన్ ప్రయాణం చేస్తుంటే లగేజీ రూల్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.

Indian Railways: మీతో పాటు ట్రైన్ కోచ్‌లోకి సైకిల్ తీసుకెళ్లవచ్చా..? ఈ రూల్స్ తెలియకపోతే భారీగా పెనాల్టీ..
Indian Railways
Venkatrao Lella
|

Updated on: Aug 26, 2026 | 8:58 PM

Share

రైల్వే పార్శిల్స్ ద్వారా బైక్‌లు వేరే ప్రాంతానికి తీసుకెళ్లడం లేదా పంపించడం లాంటివి మనకు తెలిసిందే. మందుగానే రైల్వే పార్శిల్ సర్వీస్ బుక్ చేసుకుని మీరు టూవీలర్‌ను పంపించవచ్చు. అలాగే ఇతర సామాన్లను కూడా సులువుగా పంపించే సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే రైళ్ల ద్వారా సైకిళ్లను కూడా తీసుకెళ్లవచ్చు. కానీ మీతో పాటు కోచ్‌లోకి తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు. కోచుల్లోకి ఉచితంగా కొంతవరకు లగేజీ తీసుకెళ్లవచ్చు. సాధారణ బ్యాగులు, సూట్ కేసులు, ఇతర సామాన్లను కోచుల్లోకి ఉచిత లగేజీ పరిమితి కింద తీసుకెళ్లవచ్చు. అయితే పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లాలంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉచిత లగేజీ పరిమితి కింద మీరు కోచుల్లోకి సైకిల్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు.

రైల్వే నిబంధనల ప్రకారం కోచుల్లోకి సైకిల్ తీసుకెళ్లకూడదు. మీరు జనరల్ బోగీలో ప్రయాణించినా లేదా స్లీపర్, ఏసీ కోచుల్లో వెళ్లినా మీతో పాటు సైకిల్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు. సైకిల్‌ను ప్రత్యేక పార్సెల్ లేదా సామానుగా లెక్కిస్తారు. దీంతో మీరు తీసుకెళ్లడానికి ప్రత్యేక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రైలు బయల్దేరడానికి రెండు లేదా మూడు గంటల ముందు రైల్వే స్టేషన్‌లోని లగేజ్, పార్శిల్ కార్యాలయానికి వెళ్లాలి. ట్రైన్ టికెట్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును చూపించండి. అనంతరం సైకిల్ తీసుకెళ్లేందుకు బుక్ చేసుకోండి. అనంతరం రుసుం చెల్లించి బుకింగ్ రసీదు తీసుకోండి. మీరు గమ్యస్థానానికి వెళ్లిన తర్వాత రసీదు చూపించి మీ సైకిల్ తీసుకోండి.

ఇవి కూడా చదవండి

సైకిల్‌ను ప్రయాణికులు తమతో పాటు కోచ్‌లోకి తీసుకెళ్లడానికి అనుమతించరు. మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత మీ సైకిల్‌ను ట్రైన్ ముందు లేదా వెనుక భాగంలో బ్రేక్ వ్యాన్‌లో సిబ్బంది ఎక్కిస్తారు. మీరు దిగిన తర్వాత ఆ సైకిల్‌ను గమ్యస్థానంలో ఉన్న రైల్వే పార్శిల్ కార్యాలయాన్ని సంప్రదించి తీసుకోవచ్చు. అయితే చిన్న సంచితో పట్టే మడత సైకిల్ ఉంటే మీ వెంట బోగీలోకి తీసుకెళ్లవచ్చు. పెద్ద సైకిల్ తీసుకెళ్లాలంటే ముందే బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేసుకోండా మీరు కోచుల్లోకి తీసుకెళ్తే భారీగా జరిమానా విధిస్తారు. మీ లగేజీ ఛార్జీ కంటే చాలా రెట్లు ఈ జరిమానా ఉంటుంది. అంతేకాకుండా మీ సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకోవచ్చు. ఈ నిబంధనలు చాలామందికి తెలియక పాటించరు. మీ సైకిల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై పట్టుబడినా మీకు జరిమానా విధిస్తారు. రైల్వే పార్శిల్ కార్యాలయ సిబ్బంది ట్రైన్‌లోకి స్వయంగా ఎక్కిస్తారు. మీరు తీసుకెళ్లడానికి వీలుండదు.

Follow Us