మరికొన్ని రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌పై ఎన్నో ఆశలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్యాక్స్ తగ్గింపు, పన్ను మినహాయింపు పరిమితులపై ఎన్నో్ ఆశలు నెలకొన్నాయి.
భారతీయ సంస్కృతిలో బహుమతి సంప్రదాయం శతాబ్దాలుగా ఉంది. అయితే నేటి కాలంలో మీరు ఎవరికైనా ఖరీదైన బహుమతులు ఇవ్వాలని ఆలోచిస్తుంటే.. మీరు పన్ను నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. బహుమతిగా దగ్గరి బంధువు, స్నేహితుడు మొదలైన వారికి ఆస్తి, డబ్బు లేదా మరేదైనా ఇవ్వడం ఒక పద్ధతి. ఏ వ్యక్తి అయినా కదిలే లేదా స్థిరమైన ఆస్తి రూపంలో ఏదైనా బహుమతిగా ఇవ్వవచ్చు. కానీ చాలా సందర్భాల్లో, పన్నును ఆదా చేయడానికి బహుమతి కూడా ఉపయోగించబడుతుంది.
ఇక 1958లో భారతదేశంలో గిఫ్ట్ ట్యాక్స్ మొదటిసారిగా ప్రవేశపెట్టారు. మీకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేలు వస్తే మీరు దానిపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, మీకు బహుమతిగా 50 వేలకు పైగా వచ్చినట్లయితే మీరు ఈ మొత్తానికి టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా మీకు 75,000 రూపాయలు బహుమతిగా ఇచ్చారని అనుకుందాం.. తప్పకుండా పన్ను చెల్లించాల్సిందే. కొన్ని పరిస్థితులలో రూ.50,000 కంటే ఎక్కువ గిఫ్ట్‌లు ఇవ్వడం, స్వీకరించడంపై పన్ను విధిస్తారు. ఈ విధానాన్ని ప్రభుత్వం 1998లో రద్దు చేసింది. అయితే ఇది 2004లో కొత్త రూపంలో తిరిగి ప్రవేశపెట్టారు. ఇది ఆదాయపు పన్ను నిబంధనలలో చేర్చింది. బహుమతి విలువ రూ.50,000 దాటితే, బహుమతిని స్వీకరించేవారి ఆదాయంగా బహుమతిపై పన్ను విధించబడుతుంది. బహుమతులు నగదు, నగలు, ఆస్తి మరియు ఆస్తులు, షేర్లు, వాహనాలు మొదలైన వాటితో సహా ఏ రూపంలోనైనా ఉండవచ్చు.
వ్యక్తులు స్వీకరించే బహుమతులపై ప్రభుత్వం పన్ను విధించడం జరుగుతుంది.సామాన్యులు స్వీకరించే బహుమతులను పన్ను పరిధిలో ఉంచకూడదని నిపుణులు అంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి