Budget 2023: డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? ఆస్తులు, కంపెనీల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏమంటారు?

|

Jan 25, 2023 | 1:24 PM

ఆస్తులు లేదా కంపెనీల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ రిసీట్స్‌ అంటాం. ప్రభుత్వం ఎక్కడైనా ధనం పెట్టుబడి పెడితే దానిని ఇన్వెస్ట్‌ మెంట్ అంటాం..

Budget 2023: డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? ఆస్తులు, కంపెనీల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏమంటారు?
Budget 2023
Follow us on

ఆస్తులు లేదా కంపెనీల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ రిసీట్స్‌ అంటాం. ప్రభుత్వం ఎక్కడైనా ధనం పెట్టుబడి పెడితే దానిని ఇన్వెస్ట్‌ మెంట్ అంటాం. ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. అయితే గతంలో ప్రభుత్వం చాలా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. వాటిలో ఒకటి బ్రెడ్ తయారు చేసే మోడర్న్‌ బేకరీ ఫుడ్స్‌ 1965లో ఈ కంపెనీలో మోడర్న్‌ బేకరీ ఫుడ్స్‌లో ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులను ఇన్వెస్ట్‌ మెంట్ అంటాం. 2000లో ఈ కంపెనీలో ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

దీనిని డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. ప్రభుత్వం కాలానుగుణంగా వివిధ కంపెనీలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టింది. తర్వాత ఈ వ్యాపారం అవసరం లేదని పెట్టుబడులు ఉపసంహరించుకుంది. ఆ కంపెనీలు వాటాలు అమ్మి ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ ద్వారా తిరిగి తన పెట్టుబడి సొమ్మును రాబట్టుకుందని అంటాం.

ఎయిర్ ఇండియా గతంలో ప్రభుత్వ కంపెనీయే..

క్రమేణా ఎయిర్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయింది. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలోకి వెళ్లింది. విమానాలు నడపటం కంటే చేయాల్సిన ఇతర ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయని భావించిన ప్రభుత్వం.. ఇక ఎయిర్ ఇండియా నడపలేమని విక్రయించింది. టాటా గ్రూప్‌ దాన్ని కొనుగోలు చేసింది. డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ అంత సులువు కాదు. ఢిళ్లీలో ఇప్పటికీ కొందరి దగ్గర ప్రభుత్వ కంపెనీ అయిన ఎంటీఎన్‌ ఎల్ ఫోన్లు ఉన్నాయి. వాటిని వారు వాడుతున్నారు. మిగతా వారు ఎయిర్ టెల్, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ సర్వీసులు వాడుతున్నారు. ప్రభుత్వం మొత్తం ఎంటీఎన్‌ ఎల్ కంపెనీ విక్రయించాలని నిర్ణయిస్తే అది సులువు కాదు.

ఇవి కూడా చదవండి

ఎందుకంటే ధర్నాలు ఆందోళనలు జరుగుతాయి. ప్రభుత్వ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీల పనితీరులో తేడా ఉంటుంది. గతంలో దూరదర్శన్ మాత్రమే ఉండేది. రోజూ వ్యవసాయ కార్యక్రమాలు కూడా చూసే వారు. వేరే మార్గం ఉండేది కాదు. దూరదర్శన్ ఏకఛద్రాదిపత్యం ఉండేది. తర్వాత చాలా ప్రైవేట్ ఛానల్స్‌ రాకతో పరిస్థితి మారింది. ప్రభుత్వ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీల పనితీరులో తేడా ఉంటుంది. డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణతో ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళతాయి. ఇది కష్టతరం. ఎయిర్ ఇండియా విక్రయించేందుకు ప్రభుత్వం ఏళ్ల తరబడి ఎదురు చూసింది. కానీ 2022 నాటికి అది సాధ్యమైంది. 2021- 22లో ప్రభుత్వ డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం 1,75,000 కోట్లు. 2021- 22లో జరిగిన ప్రభుత్వ డిజిన్వెస్ట్మెంట్ కేవలం 78,000 కోట్లు. పెట్టుబడుల ఉపసంహరణ కష్టతరమని అవగాహనకు వచ్చిన ప్రభుత్వం 2022-23 కి తన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని 65,000 కోట్లకు పరిమితం చేసింది. ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ఉపయోగకరమైనప్పటికీ దాన్ని అమలు చేయడం చాలా కష్టం.

అస్సెట్ మానిటైజేషన్‌ అంటే ఏంటి?

ప్రభుత్వ ఆస్తుల ద్వారా ఆదాయం సంపాదించడాన్ని అస్సెట్ మానిటైజేషన్‌ అంటాం. రైల్వే స్టేషన్లు ప్రభుత్వ ఆస్తులు. వాటిని ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇ్వవడం ద్వారా ప్రైవేట్ సంస్థలు వ్యాపారం చేసి లాభాలు పొందుతున్నాయి. అందులో కొంత భాగం ప్రభుత్వానికి చెల్లిస్తుండటంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వం ఖర్చు చేయకుండా ఆదాయం పొందుతోంది. దీన్నే అస్సెట్ మానిటైజేషన్‌ అంటాం. అస్సెట్ మానిటైజేషన్‌లో ప్రభుత్వ ఆస్తుల ప్రభుత్వం వద్దే ఉంటాయి. ఆ ఆస్తుల ద్వారా ఆదాయం పొందే మార్గం ప్రభుత్వం అమలుచేస్తుంది. కానీ డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణలో కంపెనీలు ఆస్తులను ప్రభుత్వం విక్రయం ద్వారా హక్కు కోల్పోతుంది.

ఉదాహారణ 1- మీ తండ్రి మీకిచ్చిన ఇంటిని మీరు అమ్మితే అది డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ
ఉదాహరణ 2- మీ తండ్రి మీకిచ్చిన ఇంటిని ఎవరికైనా లీజుకి, అద్దెకి ఇస్తే మీ నుండి ఇల్లు దూరమవ్వదు. మీకు ప్రతి నెలా ఆదాయం వస్తుంది. అది అస్సెట్ మానిటైజేషన్‌ అంటాం.

ఇప్పడు ఎయిర్ ఇండియాతో ప్రభుత్వానికి సంబంధం లేదు. అది డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ. చాలా రైల్వే స్టేషన్లు ప్రభుత్వం వద్ద ఉంటూనే వాటి నుండి ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రభుత్వం ఆదాయం పొందుతోంది. ఇది అస్సెట్ మానిటైజేషన్‌.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి