
Aadhaar Loan: ఆధార్ కార్డు భారతీయ పౌరులకు చాలా ముఖ్యమైన పత్రం . పిల్లలను పాఠశాలలో చేర్పించడం నుండి వృద్ధాప్య ప్రయోజనాలను పొందడం వరకు, అనేక సేవలకు ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది. మీరు ఆధార్ కార్డును ఉపయోగించి రూ. 50,000 వరకు రుణం పొందవచ్చు. అది కూడా మీరు చిన్నపాటి వ్యాపారం స్టార్ట్ చేస్తున్నట్లయితే. ఈ రుణం పొందడానికి ఎవరు అర్హులు ? ఈ రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఆధార్ కార్డు ద్వారా రుణాలు
చిన్న వ్యాపారులకు రుణ సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పీఎం స్వానిధి (PM SWANidhi). కరోనా కాలంలో దుకాణాలు మూసివేసిన అనేక మంది చిన్న, రోడ్డు పక్కన ఉన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా చిన్న, రోడ్డు పక్కన ఉన్న వ్యాపారులకు రూ. 50,000 రుణం పొందవచ్చు.
ఇది కూడా చదవండి: RBI Currency: రూ.100, రూ.500 నోట్లు మారబోతున్నాయా..? ఆర్బీఐ ప్లాన్ ఏంటి?
మూడు విడతల్లో రుణం మంజూరు:
ఈ పథకంలో ఒకేసారి కాకుండా మూడు విడతలుగా డబ్బులు ఇస్తారు. అంటే ఈ పథకంలో మొదటి విడతగా రూ.10,000 ఇస్తారు. ఏడాదిలోపు రుణం సరిగ్గా చెల్లిస్తే రెండో విడతలో రూ.20,000 అందిస్తారు. గడువులోపు డబ్బులు తిరిగి చెల్లిస్తే మూడో విడతలో రూ.50,000 వరకు రుణం ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత కలిగిన వ్యాపారులు, లబ్ధిదారులు ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర గుర్తింపు కార్డులను సమర్పించడం ద్వారా బ్యాంకుల ద్వారా ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రకమైన రుణం పొందడానికి ఎటువంటి పూచీకత్తు అవసరం లేకపోవడం గమనార్హం. కానీ మీకు నియమ నిబంధనల ప్రకారం మాత్రమే రుణం అందిస్తారు.
ఇది కూడా చదవండి: Bajaj Pulsar: పల్సర్ ప్రియులకు గుడ్‌న్యూస్.. మే నాటికి 8 సరికొత్త బైక్‌లు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి