ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్ల వాడకం బాగా పెరిగింది. అయితే మొదట్లో ఈవీ స్కూటర్లు చార్జింగ్ సమయంలో కాలిపోయి సగటు వినియోగదారుడిని బయపెట్టాయి. క్రమేపి ఆ భయం పోయి ఈవీ స్కూటర్లను వాడుతున్నారు. అయితే మళ్లీ కొన్ని ప్రాంతాల్లో ఈవీ స్కూటర్లలో మంటలు భయపెడుతున్నాయి. గత కొన్ని నెలలుగా రోడ్డుపై లేదా పార్కింగ్ స్థలంలో ఉన్నప్పుడు అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో చిక్కుకుంటున్నాయి. ఇటీవల ఒక భయంకరమైన వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు. ఈవీ స్కూటర్‌కు సంబంధించి రిమూవబుల్ బ్యాటరీ ఇంటి లోపల ఛార్జ్ చేస్తుండగా ఒకసారిగా మంటల్లో చిక్కుకుంది. చిన్నగా పొగ వ్యాపిస్తు మొత్తం రూమ్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ వీడియో యూట్యూబ్‌లో వ్యాస్ కుష్వాహా షేర్ చేశారు. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఓ ఇంటి లోపల ఛార్జ్ అవుతున్న రిమూవబుల్ బ్యాటరీ ఒకసారిగా హానికరమైన గ్యాస్‌ను లీక్ చేస్తూ తీవ్రమైన స్పార్క్‌లకు కారణం అవుతుంది. క్రమేపి మంటలు పెద్దగా గది మొత్తం వ్యాపించాయి. ముఖ్యంగా ఆ బ్యాటరీలోని మంటలు రూమ్‌లోని ప్రతి వస్తువుకు వ్యాపించింది. వీడియోను రికార్డ్ చేస్తున్న వ్యక్తి తన బ్యాగ్‌లలో ఒకదాన్ని సేవ్ చేయడానికి ప్రవేశించాడు. వెంటనే ఇతర గదికి వెళ్లి అతని తల్లి కిటికీ దగ్గర నిలబడి ప్రజలను సహాయం కోరాడు. అయితే ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన కచ్చితమైన ప్రదేశం తెలియరాలేదు. ఈ నేపథ్యంలో అనుకోని పరిస్థితుల్లో ఈవీ స్కూటర్ ఫైర్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.