మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్..! ఏప్రిల్‌లో ఏం జరగబోతుందంటే..?
ఏప్రిల్ 2026లో దేశవ్యాప్తంగా లేదా కొన్ని రాష్ట్రాల్లో డ్రై డేస్ ఉండనున్నాయి. గుడ్ ఫ్రైడే (ఏప్రిల్ 3), మహావీర్ జయంతి (ఏప్రిల్ 10), అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) వంటి ముఖ్యమైన రోజులలో మద్యం అమ్మకాలు నిషేధించబడతాయి. నిబంధనలు రాష్ట్రాల వారీగా మారవచ్చు కాబట్టి, స్థానిక ప్రకటనలను తనిఖీ చేసి, ముందుగానే ప్రణాళిక చేసుకోవడం అవసరం.

మద్యం ప్రియులకు ఏప్రిల్‌లో డ్రై డేస్ భారీగా ఎదురుకానున్నాయి. ఆయా తేదీల్లో దేశవ్యాప్తంగా లేదా కొన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధించబడతాయి. సాధారణంగా జాతీయ పర్వదినాలు, మతపరమైన వేడుకలు, ముఖ్యమైన జయంతుల సందర్భంగా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఏప్రిల్ 2026లో కూడా కొన్ని ముఖ్యమైన రోజుల్లో డ్రై డే అమలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏప్రిల్ 3న అనేక రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు నిలిపివేయబడవచ్చు. అలాగే జైనుల ముఖ్య పండుగ అయిన మహావీర్ జయంతి రోజున, అంటే ఏప్రిల్ 10న కూడా పలు ప్రాంతాల్లో లిక్కర్ షాపులు మూసివేయబడే అవకాశం ఉంది. అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అయిన ఏప్రిల్ 14న ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్రై డే అమలు చేసే అవకాశం ఉంది.
డ్రై డేస్ రోజుల్లో మద్యం దుకాణాలు, బార్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు మద్యం అమ్మకాలు నిర్వహించలేవు. లైసెన్స్ ఉన్న సంస్థలకు కూడా ఆ రోజు మద్యం అందించడానికి అనుమతి ఉండదు. అయితే ముందుగానే కొనుగోలు చేసిన మద్యం వ్యక్తిగత వినియోగానికి ఇంట్లో ఉపయోగించడం సాధారణంగా నిషేధం కాదు.
ఇక డ్రై డే నిబంధనలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. ప్రతి రాష్ట్రం తన స్థానిక పండుగలు, సంప్రదాయాలు, పరిపాలనా నిర్ణయాల ఆధారంగా అదనపు డ్రై డేస్ ప్రకటించవచ్చు లేదా కొన్ని తేదీలను మినహాయించవచ్చు. అందువల్ల స్థానిక అధికారుల ప్రకటనలను పరిశీలించడం ముఖ్యం. మొత్తంగా ఏప్రిల్ నెలలో పండుగలు, జాతీయ సందర్భాల నేపథ్యంలో మద్యం విక్రయాలపై పరిమితులు ఉండే అవకాశం ఉన్నందున, వినియోగదారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
