Netflix Subscription Scam: నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు అలెర్ట్‌.. వెలుగులోకి మరో నయా స్కామ్‌

|

Dec 04, 2024 | 3:56 PM

నెట్ ఫ్లిక్స్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్స్‌లో ఒకటిగా ఉంది. అయితే నెట్‌ ఫ్లిక్స్‌ యూజర్లను టార్గెట్‌ చేస్తూ ఓ నయా స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించడమే లక్ష్యంగా స్కామర్లు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌ స్కామ్‌ గురించి మర్నిని వివరాలను తెలుసుకుందాం.

Netflix Subscription Scam: నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు అలెర్ట్‌.. వెలుగులోకి మరో నయా స్కామ్‌
Netflix
Follow us on

నెట్ ఫ్లిక్స్ వినియోగదారులను టార్గెట్‌ చేస్తూ వారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా అనుమానాస్పద లింక్‌లను స్కామర్లు పంపుతన్నారు. ఈ స్కామ్‌ ద్వరా యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రేలియాతో సహా 23 దేశాల్లోని వినియోగదారుల వ్యక్తిగత సమాచారం పొందడానికి స్కామర్లు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ స్కామ్ అనేది పూర్తిగా ఫిషింగ్ దాడి నిపుణులు చెబుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌లో కొంత సమస్య ఉందని పేర్కొంటూ నెట్ ఫ్లిక్స్ వినియోగదారులకు హానికరమైన టెక్స్ట్‌ మెసేజ్‌లను పంపుతున్నారు. నెట్‌ ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపు విఫలమైందని పేర్కొంటూ టెక్స్ట్‌ మెసేజ్‌ వస్తుంది. 

సబ్‌స్క్రిప్షన్‌ తిరిగి యాక్టివేట్‌ చేయాలంటే కింద ఉన్న లింక్‌ను ఓపెన్‌ చేయండి అనే మెసేజ్‌వస్తుంది. అలాగే ఆ లింక్‌ కూడా అధికారిక నెట్‌ఫ్లిక్స్‌ ఖాతాను సంబంధించిన లింక్‌గానే ఉంటుంది. ఆ లింక్‌ ఉపయోగించి మీ లాగిన్‌ అయితే అందులో సేవ్‌ చేసుకున్న లాగిన్ పాస్వర్డ్లు, వ్యక్తిగత వివరాలు, క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని దోచేస్తున్నారు. ముఖ్యంగా మిమ్మల్ని లాగిన్ ఆధారాలు, చెల్లింపు అప్డేట్ వంటి వివరాలను అడుగుతుంది. మీరు అలా చేయగానే స్కామర్లు సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తారు. 

జాగ్రత్తలు తప్పనిసరి

ఇలాంటి మొబైల్ ఫిషింగ్ స్కామ్‌లు కొత్త కానప్పటికీ యూజర్లు ఇలాంటి విషయాలపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. టెక్స్ట్ మెసేజ్‌లోని లింక్ ఓపెన్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉన్నా స్వల్వ వ్యత్యసాలు ఉంటాయి. కాబట్టి యూఆర్ఎల్‌ను ఎల్లప్పుడూ జాగ్రత్తగా తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మీ ఖాతా తాత్కాలికంగా నిలిపేస్తున్నాం అనే మెసేజ్ స్క్రీన్‌పై కనిపిస్తే మాత్రం కచ్చితంగా అనుమానించాలి. ఎందుకంటే ఏ సబ్‌స్క్రిప్షన్ యాప్ ఇలాంటి మెసేజ్‌లను ఇవ్వదు. కాబట్టి లింక్‌పై క్లిక్ చేయకుండా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి క్రాస్ చెక్ చేసుకోవడం ఉత్తమం. అలాగే ఫిషింగ్ ప్రయత్నాలతో ఇతర ఇతర బెదిరింపులను గుర్తించడంలో సహాయపడే యాంటీవైరస్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్స్‌ను తప్పనిసరిగా రక్షించుకోవాలి. ముఖ్యంగా ఫిషింగ్ మెసేజ్ వస్తే నెట్‌ఫ్లిక్స్‌కు లేదా సంబంధిత అధికారులకు నివేదించాలి. దీనివల్ల ఇతరులు బాధితులుగా మారకుండా నిరోధించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి