AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel: కస్టమర్లకు బిగ్ షాక్.. ఆ రీఛార్జ్ ప్లాన్ తీసేసిన ఎయిర్‌టెల్..

ఎయిర్‌టెల్ ఒక రీఛార్జ్ ప్లాన్‌ను తొలగించింది. రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిలిపివేసి.. కస్లమర్లకు షాక్ ఇచ్చింది. తక్కువ బడ్జెట్‌లో డైలీ డేటా కావాలనుకునేవారికి ఈ రీఛార్జ్ బెస్ట్‌గా ఉండేది. కంపెనీ నిర్ణయంతో యూజర్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు కస్లమర్లకు ఉన్న ఆప్షన్ ఏంటంటే..?

Airtel: కస్టమర్లకు బిగ్ షాక్.. ఆ రీఛార్జ్ ప్లాన్ తీసేసిన ఎయిర్‌టెల్..
Airtel Rs 249 Recharge Plan
Krishna S
|

Updated on: Aug 20, 2025 | 3:10 PM

Share

రిలయన్స్ జియో తర్వాత ఎయిర్‌టెల్ కూడా ప్రీపెయిడ్ కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. అందరు ఎక్కువగా రీఛార్జ్ చేసుకునే ప్లాన్‌ను తొలగించింది. కంపెనీ నిర్ణయంపై యూజర్లు ఫైర్ అవుతున్నారు. తక్కువ ధరతో రోజువారీ డేటాను కోరుకునే వారికి రూ.249 ప్లాన్‌ ఉత్తమంగా ఉండేది. ఇప్పుడు ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ నిలిపివేసింది. రూ.249 ప్లాన్‌లో ఏం అందుబాటులో ఉండేవి.. ప్రస్తుతం దాని ప్లేస్‌లో ఏ ప్లాన్ బాగుంది..? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఎయిర్‌టెల్ 249 ప్లాన్ వివరాలు

రూ.249 ప్లాన్‌తో ప్రీపెయిడ్ వినియోగదారులు ప్రతిరోజూ 1 జీబీ హైస్పీడ్ డేటా, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందేవారు. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో ఉచిత ఎక్స్‌ట్రీమ్ ప్లే, పర్ప్లెక్సిటీ ప్రో ఏఐ, ఉచిత హలోట్యూన్ యాక్సెస్ ఉండేవి.

రూ. 249 ప్లాన్ చెల్లుబాటు

ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో 24 రోజుల చెల్లుబాటు ప్రయోజనం ఉంది. ఈ ప్లాన్ జనవరి 2026 వరకు వినియోగదారులకు ఉచిత ఏఐ యాక్సెస్‌ను కూడా అందించింది. ఇప్పుడు రూ.249 ప్లాన్‌ను కొనుగోలు చేసే వారు రూ.299 ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రూ.249 తర్వాత ఈ శ్రేణిలో ఉన్న నెక్ట్స్ ప్లాన్ రూ.299 మాత్రమే.

ఎయిర్‌టెల్ 299 ప్లాన్

రూ.299 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో కంపెనీ రోజుకు 1జీబీ హై స్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. 28 రోజుల చెల్లుబాటుతో వచ్చే ఈ ప్లాన్ స్పామ్ అలర్ట్, ఉచిత హెలోట్యూన్, పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

రిలయన్స్ జియో 249 ప్లాన్

రూ.249 జియో ప్లాన్‌తో ప్రతిరోజూ 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో 28రోజుల పాటు జియో టీవీ యాక్సెస్ లభించింది. అయితే ఈ ప్లాన్‌ను జియో ఇటీవలే తొలగించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..