AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ కోనాలనుకుంటున్నారా..? సామాన్యులకు పిడుగు లాంటి వార్త..

దసరా, దీపావళి పండుగల వేళ ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెంపు షాక్ తగలనుంది. పరిశ్రమ వర్గాల ప్రకారం అక్టోబర్ 1 నుంచి ACల ధరలు సుమారు 5–8 శాతం, కొన్ని టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల ధరలు 3–4 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. రాగి, అల్యూమినియం, ఉక్కు, క్రూడ్ డెరివేటివ్స్ ధరలు, ఫ్రైట్ ఖర్చులు, కరెన్సీ మార్పులు ఈ పెంపునకు కారణాలుగా చెబుతున్నారు.

టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ కోనాలనుకుంటున్నారా..? సామాన్యులకు పిడుగు లాంటి వార్త..
Ac Tv Home Appliances
Shaik Madar Saheb
|

Updated on: Sep 29, 2026 | 9:15 AM

Share

ఇరాన్‌ వార్‌ ఎఫెక్ట్‌ ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. ఉప్పు,నిప్పులా ఇంకా యుద్ధం రగులుతూనే ఉండటంతో.. ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ధరలుపై దాని ప్రభావం పడబోతోంది. టీవీ, ఏసీల తయారీకి ఉపయోగపడే ముడిచమురు.. దిగుమతి అవడం ఆలస్యమవుతుండటంతో వాటి రేట్లపై ప్రభావం చూపబోతున్నాయి. పండుగల సీజన్‌ వేళ 10 శాతం వరకు ధరలు పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. పలు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్.. అప్లయెన్సెస్ తయారీదారులు అక్టోబర్ 1 నుండి ధరలను పెంచనున్నారు. ఎయిర్ కండిషనర్లు 5-8 శాతం వరకు మరింత ఖరీదైనవిగా మారవచ్చు, కాగా కొన్ని టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల ధరలు సుమారు 3-4 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా పలు ఉత్పత్తులపై 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.. పాత టీవీని మార్చడానికి లేదా ఏసీని అప్‌గ్రేడ్ చేయడానికి దీపావళి అమ్మకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి, ఇది చేదు వార్తనే చెప్పవచ్చు.. ఎందుకంటే.. దసరా నుంచి దీపావళి వరకు.. సంవత్సరంలో అత్యంత ఎక్కువగా షాపింగ్ జరుగుతుంది.

అయితే.. పండుగల సీజన్‌పై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఇప్పట్లో ఈ అనిశ్చితి ముగిసేలా కనిపించడం లేదు. దీంతో నివురుగిప్పిన నిప్పులా మారడంతో.. ఆ ప్రభావం మనదేశంపైనా పడుతోంది. దసరా, దీపావళి పండుగల సీజన్‌ కావడంతో ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలపై ఆఫర్లు ప్రకటిస్తారని ఎదురుచూసే వినియోగదారులకు.. ఈసారి ధరాఘాతం తప్పదనిపిస్తోంది. ఏసీ, టీవీ వంటి వస్తువుల రేట్లు పెరగనున్నాయి.

ఉద్యోగులకు బోనస్‌లు వచ్చే సమయం కావడంతో.. సహజంగానే ఈ పండుగల వేళ ఇంట్లో గృహోపకరణాలను కొనేందుకు చాలా మంది ఎగబడుతుంటారు. కానీ అసారి ఆ అవకాశం కనిపించడం లేదు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా రాగి, ఉక్కు, అల్యూమినియం, ప్లాస్టిక్‌, ముడిచమురు ఉత్పత్తుల ధరలు అమాంతం పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. పెరిగిన ధరలను వినియోగదారులపై వేయకతప్పని పరిస్థితులు. దానికితోడు నౌక రవాణా ఛార్జీలు, రూపాయి పోలిస్తే డాలర్‌ బలపడటం వంటివి కూడా ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద డీలర్లు ముందస్తుగా సరుకు తీసుకుని, పండగల సమయంలో వినియోగదారులను తక్కువ ధరలతో ఆకట్టుకునే వీలుంటుంది. చిన్న డీలర్లు మాత్రం ఆర్థిక స్థోమత వల్ల ఎక్కువ సరకు తీసుకోలేరు కనుక, వీరికి ధరల భారం తప్పని పరిస్థితి. లోహాలు సహా ముడి పదార్థాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తమ స్పోర్ట్స్‌ వినియోగ వాహన శ్రేణి ధరలను మరో విడత పెంచాలని యోచిస్తున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రకటించింది. ఇలా ప్రతీ విభాగంలో ధరల పెరుగుదల ప్రభావం కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఎలక్ట్రానిక్స్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

ఒక ఉత్పత్తి షోరూమ్‌కు చేరక ముందే ఒత్తిడి మొదలవుతుంది. ఎయిర్ కండిషనర్లు మరియు ఇతర ఉపకరణాల తయారీకి రాగి, అల్యూమినియం ముఖ్యమైన ముడి పదార్థాలుగా ఉపయోగపడతాయి. ఉక్కును అనేక విభాగాలలో వినియోగిస్తుండగా, ముడి చమురు ఉత్పన్నాలను ప్లాస్టిక్‌లు, ఇతర భాగాల తయారీకి వాడతారు. ఐ సరుకు రవాణా కూడా మరింత ఖరీదైనదిగా మారింది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సంఘర్షణ నౌకా రవాణా మార్గాలకు అంతరాయం కలిగించి, వస్తువుల రవాణాపై అనిశ్చితిని సృష్టించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సామాన్యులపై వార్ ఎఫెక్ట్.. పెరగనున్న ఆ వస్తువుల ధరలు..
సామాన్యులపై వార్ ఎఫెక్ట్.. పెరగనున్న ఆ వస్తువుల ధరలు..
వైన్‌ షాప్‌లో దూరిన కోతి.. మందు బాటిల్‌ ఎత్తి దించకుండా తాగేసింది
వైన్‌ షాప్‌లో దూరిన కోతి.. మందు బాటిల్‌ ఎత్తి దించకుండా తాగేసింది
IND vs WI 2nd ODI: రెండో వన్డేలో ఓ మార్పుతో బరిలోకి భారత జట్టు..?
IND vs WI 2nd ODI: రెండో వన్డేలో ఓ మార్పుతో బరిలోకి భారత జట్టు..?
దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం!
దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం!
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..