
AC Servicing: డీప్ క్లీనింగ్, సర్వీస్ చేసిన తర్వాత కూడా ఏసీ గదిని చల్లబరచకపోతే అది ఆందోళన కలిగించే విషయం. ఏసీ సర్వీసింగ్ తర్వాత కూడా మీరు కూలింగ్ సమస్యలను ఎందుకు ఎదుర్కొంటున్నారో, దానిని పరిష్కరించడానికి మీరు ఏమి చేయాలో తెలుసుకోండి. సర్వీస్ తర్వాత కూడా మీరు కూలింగ్ సమస్యలను ఎదుర్కొంటుంటే, కూలింగ్ కాయిల్‌లో, అంటే ఎవాపరేటర్ లేదా కండెన్సర్ కాయిల్‌లో సమస్య ఉండవచ్చు. ఇదే సమస్యకు మూల కారణం కావచ్చు. అలాగే తక్షణ చర్య అవసరం. లేకపోతే గ్యాస్ లీక్ అవుతుంది. దానివల్ల మీరు రీఫిల్ కోసం డబ్బు చెల్లించాల్సి వస్తుంది.
ఏ ఎయిర్ కండిషనర్‌లోనైనా కూలింగ్ కాయిల్ మీ ఏసీ లోపల జరిగే ఉష్ణ మార్పిడి మొత్తాన్ని నిర్వహిస్తుంది. అది మురికిగా మారినా, అరిగిపోయినా, లేదా పాడైపోయినా, మీ ఏసీ సరిగ్గా చల్లబరచడానికి ఇబ్బంది పడవచ్చు. కూలింగ్ కాయిల్ సమస్యను పరిష్కరించడానికి వేల రూపాయలు ఖర్చు కావచ్చు. ఇండియా టీవీ నివేదిక ప్రకారం, మీ కూలింగ్ సిస్టమ్‌ను రిపేర్ చేయడానికి, మీరు మూడు ముఖ్యమైన పనులను చేయాల్సి ఉంటుంది. డీప్ క్లీనింగ్, గ్యాస్ రీఫిల్లింగ్, కాయిల్ రిపేర్.
ఇది కూడా చదవండి: Dubai Gold: దుబాయ్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? మన దేశంలోని ధరలతో పోలిస్తే ఎంత తేడా?
ఇది కూడా చదవండి: Silver Price: మహిళలకు శుభవార్త.. ఏకంగా రూ.50 వేలు తగ్గిన వెండి ధర.. ఇంకా తగ్గుతుందా?
ఇది కూడా చదవండి: Cheapest Fuel: ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్.. లీటర్ ధర కేవలం 3 రూపాయల లోపే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి