Gold Price Today: మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్స్.. స్వల్పంగా పెరుగుదల.. నేటి ధరలు ఇలా..

|

Oct 13, 2023 | 7:16 AM

Gold Price Today: గత కొద్ది రోజులుగా బంగారం ధరలు ఊగిసలాడుతున్నాయి. పెరగాలా? తగ్గాలా? అన్నట్లుగా ఉంది పరిస్థితి. తాజాగా గురువారం నాడు స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేడు పరుగులు పెట్టింది. శుక్రవారం రోజున(October 13 Gold Rates) పుత్తడి ధరలో కొంత పెరుగుదల నమోదైంది. తాజా లెక్కల ప్రకారం..

Gold Price Today: మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్స్.. స్వల్పంగా పెరుగుదల.. నేటి ధరలు ఇలా..
Gold Price Today
Follow us on

Gold Price Today: గత కొద్ది రోజులుగా బంగారం ధరలు ఊగిసలాడుతున్నాయి. పెరగాలా? తగ్గాలా? అన్నట్లుగా ఉంది పరిస్థితి. తాజాగా గురువారం నాడు స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేడు పరుగులు పెట్టింది. శుక్రవారం రోజున(October 13 Gold Rates) పుత్తడి ధరలో కొంత పెరుగుదల నమోదైంది. తాజా లెక్కల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో రూ. 380 పెరిగింది. అంటే గ్రాముకు రూ. 38 చొప్పున పెరిగింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,910గా ఉంది. గురువారం నాడు ఇదే బంగారం గ్రాములకు రూ. 58,530 చొప్పున ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరలోనూ మార్పుు చోటు చేసుకుంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ. 35 చొప్పున పెరిగి 10 గ్రాములు రూ. 54,000 లకు చేరుకుంది. గురువారం ఈ బంగారం ధర రూ. 53,650 ఉంది. ప్రస్తుతం22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 5,400, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 5,891 చొప్పున ఉంది. దీని ప్రకారం నిన్నటికి ఇవాళ్టికి వ్యత్యాసం రూ. 350. అంతకు ముందు వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు.. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టాయి. దాంతో బంగారం ప్రియులు పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు షాప్‌లకు పరుగులు తీశారు. ఫలితంగా డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో.. పసిడి ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.

శుక్రవారం మార్కెట్ వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధరూ. 58,910 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 54,000 పలుకుతోంది. ఏపీలోని విజయవాడలోనూ దాదాపు రేట్స్ ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 58,910 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 54,000 గా ఉంది. విశాఖపట్నంలోనూ సేమ్ రేట్స్ నడుస్తున్నాయి.

దేశీయ మార్కెట్‌లో ధరలు ఇలా..

⚖︎ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 54,150 కాగా, 24 క్యారెట్స్‌ గొల్డ్‌ ధర రూ. 59,060గా ఉంది.

ఇవి కూడా చదవండి

⚖︎ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 54,000 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,910 గా ఉంది.

⚖︎ కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,000 గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 58,910 వద్ద కొనసాగుతోంది.

⚖︎ చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 59,070గా ఉంది.

⚖︎ బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 54,000 కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 58,9100 వద్ద కొనసాగుతోంది.

తగ్గిన వెండి ధరలు..

వెండి ధరలో కూడా స్వల్పంగా మార్పు చోటు చేసుకుంది. గ్రాముకు రూ. 5 చొప్పున.. కేజీపై రూ. 500 పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 72,600 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశంలోని ప్రధాన నగరాన్నింటిలోనూ ఇదే విధంగా ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75,500 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో రూ. 75,500 చొప్పున పలుకుతోంది. ఢిల్లీలో రూ. 72,600, ముంబైలో 72,600, బెంగళూరులో రూ. 71,500, కోల్‌కతా రూ. 72,600, చెన్నైలో 75,500.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..