బుమ్రా ఖాతాలో కొత్త‌ రికార్డు!

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో కరుణరత్నె వికెట్ తీసిన బుమ్రా ఖతాలో వంద వికెట్లు చేరాయి. ఫలితంగా అతి తక్కువ వన్డేల్లో ఆ మైలురాయిని చేరుకున్న రెండో ఇండియన్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. బుమ్రాకు ఇది 57వ వన్డే కాగా, 56 వన్డేల్లోనే వంద వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో […]

బుమ్రా ఖాతాలో కొత్త‌ రికార్డు!
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2019 | 4:45 PM

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో కరుణరత్నె వికెట్ తీసిన బుమ్రా ఖతాలో వంద వికెట్లు చేరాయి. ఫలితంగా అతి తక్కువ వన్డేల్లో ఆ మైలురాయిని చేరుకున్న రెండో ఇండియన్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. బుమ్రాకు ఇది 57వ వన్డే కాగా, 56 వన్డేల్లోనే వంద వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఇర్ఫాన్ పఠాన్ (59), జహీర్ ఖాన్ (65), అజిత్ అగార్కర్ (67), జవగళ్ శ్రీనాథ్ (68) ఉన్నారు.