రైతులు నిరసన చేస్తుంటే మీరు ప్యాలస్ లు కట్టుకుంటున్నారు, మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

ఓ వైపు రైతులు 16 రోజులుగా ఢిల్లీ శివార్లలో చలిలో నిరసనలు చేస్తుంటే మరోవైపు మీరు ప్యాలస్ లు కట్టుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఢిల్లీలో కొత్త పార్లమెంట్..

రైతులు నిరసన చేస్తుంటే మీరు ప్యాలస్ లు కట్టుకుంటున్నారు, మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 10, 2020 | 4:39 PM

ఓ వైపు రైతులు 16 రోజులుగా ఢిల్లీ శివార్లలో చలిలో నిరసనలు చేస్తుంటే మరోవైపు మీరు ప్యాలస్ లు కట్టుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనానికి మోదీ గురువారం శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఈ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా దీనిపై మండిపడ్డారు. వణికించే చలిలో అన్నదాతలు ఇన్ని రోజులుగా అందోళనలు చేస్తున్నారు.. కానీ మీరు విలాస భవనాలు నిర్మిస్తున్నారు అని ఆయన ట్వీట్ చేశారు. వారు తమ హక్కులకోసం వీధుల్లో పోరాటం చేస్తుండగా సెంట్రల్ విస్టా పేరిట మీరు ప్యాలస్ లు నిర్మించడం చరిత్రలో ఓ రికార్డుగా నిలిచిపోతుందని, ప్రజాస్వామ్యంలో మీ ఇష్టాలు తీర్చుకోవడానికి అధికారమన్నది ఓ కారణం కాదని సూర్జేవాలా పేర్కొన్నారు. అది ప్రజాసేవకు, ప్రజా సంక్షేమానికి మీడియం వంటిదన్నారు.

పార్లమెంట్ అంటే మోర్టార్, స్టోన్స్ కాదు, ఇది డెమొక్రసీకి ప్రతిరూపం, ఇది రాజ్యాంగానికి నిదర్శనం, ఇది 130 కోట్ల మంది భారతీయుల ఆశయం అని పేర్కొన్నారు. ఈ విలువలను పక్కన బెట్టి విలాసవంతమైన భవనం నిర్మించడంలో ఔచిత్యం ఉందా అని సూర్జేవాలా ప్రశ్నించారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..