సర్కార్ సైట్ ను హ్యాక్ చేసిన సోదరులు అరెస్ట్

అక్రమ దందా కోసం సర్కార్ సైట్ కే ఎసరు పెట్టారు ఇద్దరు అన్నదమ్ములు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమ ఇసుక బుకింగ్ కు పాల్పడుతున్న ఇద్దరిని ఎస్ వో టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5 ల్యాప్ టాప్స్ తో పాటు 3 మొబైల్ ఫోన్లు, ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను స్వాధీనం చేసుకున్నారు.

సర్కార్ సైట్ ను హ్యాక్ చేసిన సోదరులు అరెస్ట్
Follow us

|

Updated on: Jul 16, 2020 | 7:00 PM

అక్రమ దందా కోసం సర్కార్ సైట్ కే ఎసరు పెట్టారు ఇద్దరు అన్నదమ్ములు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమ ఇసుక బుకింగ్ కు పాల్పడుతున్న ఇద్దరిని ఎస్ వో టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5 ల్యాప్ టాప్స్ తో పాటు 3 మొబైల్ ఫోన్లు, ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను స్వాధీనం చేసుకున్నారు.

సర్కార్ పోర్టల్ ను హ్యాక్ చేసి ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్నారు అన్నదమ్ములు. కామారెడ్డి జిల్లా అయ్యప్పనగర్కు చెందిన సిసోడియా అరిహంత్ జైన్ (25), సిసోడియా ఆదేశ్ జైన్(21) అన్నదమ్ములకు నాలుగు ఇసుక లారీలతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. బుకింగ్ ల కోసం రోజుల తరబడి నిరీక్షణ తప్పడంలేదు. దీంతో ఇసుకను అక్రమ రవాణాకు ప్లాన్ చేశారు. ఇందుకు రాష్ట్ర సర్కార్ శాండ్ సేల్స్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్ బుకింగ్స్ టెక్నిక్స్ తెలుసుకున్నారు. ఆటోఫిల్ సాఫ్ట్ వేర్ ను కొని ల్యాప్ టాప్స్ లో ఇన్ స్టాల్ చేసుకున్నారు. అంతేకాదు, పుణేకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనురాగ్ తో 40 శాతం వరకు కమీషన్ ఇస్తామని చెప్పి ర్యాపిడ్ బుకింగ్ సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేయించారు. దీంతో ‘తెలంగాణ శాండ్ ప్రొడక్టివిటీ టూల్’ను రూ.3 వేలకు అదేశ్ ల్యాప్ టాప్ లో ఇల్లీగల్ గా అనురాగ్ ఇన్ స్టాల్ చేశాడు. తమ వ్యాపారం కోసం గూగుల్లో ప్రకటనలు ఇస్తూ ఈజీగా సాండ్ బుకింగ్ చేస్తూ అక్రమంగా కమీషన్లు పొందుతున్నారు. ఇసుక వ్యాపారులతో దందా చేస్తూ ఒక్కో బుకింగ్ కు రూ.1,400 నుంచి రూ.1,600 వరకు కమీషన్ వసూలు చేశారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ సాండ్ బుకింగ్ సైట్ లో బినామీల పేరిట ఆదేశ్ నాలుగు, అరిహంత్ ఒక బ్యాంక్ అకౌంట్లు తెరిచారు. పోతుల సందీప్ రెడ్డి, యాద అభినవ్, శాస్త్రీ లక్ష్మి ప్రసాద్ పేర్లతో మరో 3 బినామీ అకౌంట్లు ఓపెన్ చేశారు. ఇద్దరు అన్నదమ్ముళ్లు దాదాపు రూ.50 లక్షల వ్యాపారం చేశారని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఇలాగే ఎజెడ్ క్యాప్చా, వ్రోక్ స్పేస్, మహాదేవ్ ప్లానెట్ పేరుట ఇసుక బుకింగ్ పోర్టల్స్ నడుపుతున్నట్టూ పోలీసులు గుర్తించామన్నారు. అక్రమ దందా నడుపుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసిన రిమాండ్ కు తరలించినట్లు కమిషనర్ వెల్లడించారు.

Latest Articles