ఆకట్టుకుంటోన్న ‘బ్రోచేవారెవరురా’ ఫస్ట్‌లుక్

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్ ప్రధానపాత్రలలో వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘బ్రోచేవారెవరురా’. నివేథా థామస్, నివేథా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్‌లుక్ విడుదలైంది. వైవిధ్యంగా వచ్చిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే మరో వైవిధ్య కథతో శ్రీవిష్ణు రాబోతున్నట్లు తెలుస్తోంది. మాన్యం ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా విజువల్ టేల్ పేరుతో ఈ మూవీ […]

ఆకట్టుకుంటోన్న ‘బ్రోచేవారెవరురా’ ఫస్ట్‌లుక్
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2019 | 2:54 PM

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్ ప్రధానపాత్రలలో వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘బ్రోచేవారెవరురా’. నివేథా థామస్, నివేథా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్‌లుక్ విడుదలైంది. వైవిధ్యంగా వచ్చిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే మరో వైవిధ్య కథతో శ్రీవిష్ణు రాబోతున్నట్లు తెలుస్తోంది. మాన్యం ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా విజువల్ టేల్ పేరుతో ఈ మూవీ నుంచి ఆ మధ్యన వచ్చిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకునే విషయం తెలిసిందే.