హైదరాబాద్ ప్రజల ప్రాణాలకు కొత్త సంకటం

అకాలంగా కురుస్తున్న అతిభారీ వర్షాలతో చిగురుటాకులా వణికిపోతున్న భాగ్యనగరంలో సరికొత్త సమస్య మొదలైంది. అసలే వరద నీటి బురదలో బతుకీడుస్తూ సాయం కోసం దీనంగా చూస్తున్న నగర జీవులకు కొత్త ప్రమాదం ఎదురవుతోంది.

హైదరాబాద్ ప్రజల ప్రాణాలకు కొత్త సంకటం
Follow us

|

Updated on: Oct 20, 2020 | 7:47 PM

అకాలంగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో చిగురుటాకులా వణికిపోతున్న భాగ్యనగరంలో సరికొత్త సమస్య మొదలైంది. అసలే వరద నీటి బురదలో బతుకీడుస్తూ సాయం కోసం దీనంగా చూస్తున్న నగర జీవులకు కొత్త ప్రమాదం ఎదురవుతోంది. ఓవైపు వరద బురద, మరోవైపు అంటు రోగాల బెడద… వీటికి తోడు కొత్త సమస్య మొదలవడంతో నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

వరదలతో వణికి పోతున్న హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు పాముల బెడద మొదలైంది. వాటి ఆవాసాలు కోల్పోయిన పాములు ప్రజల నివాసాల మీద పడుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా వరదల కారణంగా అధిక సంఖ్యలో పాములు బయటికి రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. విషనాగులు విశ్వనగరంపై విషం చిమ్మేందుకు సిద్ధమయ్యాయా అనే అనుమానాలు మొదలయ్యాయి. అసలే మహా నగరం… విశ్వ నగరంగా రూపాంతరం చెందుతోంది. నగరం నలువైపులా విస్తరిస్తోంది. నగరంలో ఏ మూల ప్లేస్ దొరికినా ఆవాసాలుగా మార్చుకుంటున్నారు ప్రజలు. లోతట్టు ప్రాంతాల్లో కూడా ఆవాసాలు నిర్మించుకుని ఇప్పుడు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వరదల ఇబ్బంది చాలదన్నట్టు పాముల బెడద కూడా ఎదురైంది నగర శివార్లలోని ప్రజలకు.

వరదలకు ప్రజలు మాత్రమే ఆవాసాలు కోల్పోవడం కాదు. ఎన్నో ప్రాణులు కూడా వాటి అవాసాన్ని కోల్పోయాయి. వరదలకు కొట్టుకొచ్చి జనాల మధ్యకు వస్తున్నాయి. దీంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అసలే వరదలు. దాంతో బురద. ఇప్పుడు ఇవి చాలదా అన్నట్టుగా పాముల బెడద కూడా తయారయింది. సంవత్సరానికి 5 నుంచి 6 వేల వరకు పాముల్ని రెస్క్యూ చేసేవాళ్ళమని ఇప్పుడు వరదలోనే దాదాపు 150 వరకు రెస్క్యూ చేసామని అంటున్నారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు. దీనిలో విషపూరితమైన కోబ్రాలు కూడా ఉన్నాయి అంటున్నారు. ముఖ్యంగా ఎల్బి నగర్- హయత్ నగర్, అత్తాపూర్- లంగర్ హౌస్, అమీన్పూర్- మియాపూర్ ప్రాంతాలలో ఎక్కువగా పట్టుకోవడం జరిగింది అంటున్నారు.

వరదల్లోకి కొట్టుకు రావడానికి ప్రధాన కారణం వరద నీటిలో వాటి ఆవాసాలు కోల్పోవడమేనని అంటున్నారు స్నేక్ సొసైటీ సభ్యులు. నీటిలో కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉండగలవని పొడి ప్రాంతాలకు చేరుకునేందుకు మాత్రం ప్రయత్నిస్తాయని అంటున్నారు. వాటిని చూసినప్పుడు 10 నుంచి 15 అడుగుల దూరంలో ఉండడం మంచిదని అంటున్నారు. ముఖ్యంగా సామాన్లు జరిపే టైంలో… పొడి ప్రదేశాలలో… ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పాము కనిపించినా వెంటనే వాటికి దూరంగా ఉండి, తమను సంప్రదిస్తే వాటిని రెస్క్యూ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహాయంతో అడవిలో వదిలిపెడతామని అంటున్నారు స్నేక్ సొసైటీ సభ్యులు. అలాగే కొన్ని గుర్తుల ద్వారా కూడా విషపూరితమైన పాములను గుర్తించవచ్చని అంటున్నారు.

మొత్తం మూడు వేల రకాల పాముల జాతులలో ఆరు వందల జాతులు మాత్రమే విషపూరితమైనవని అంటున్నారు డాక్టర్లు. పాము కాటు వేసినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. భయపడడం వల్ల మరణావకాశాలు పెరుగుతాయని అంటున్నారు. కాటును పరిశీలించి 108కి కాల్ చేయాలని అంటున్నారు. విషపూరితమైన పాము కాటు వేస్తే 20 నిమిషాల నుంచి ఆరు గంటల లోపు వీక్నెస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.

Also read: వ్యాక్సిన్ వచ్చేదాకా అలసత్వం వద్దు.. దేశప్రజలకు మోదీ పిలుపు

Also read: Breaking News యాంటీ బాడీస్ తగ్గితే మళ్ళీ కరోనా

Also read: ఏపీ స్కూళ్ళలో కోవిడ్ ఆంక్షలివే.. స్వయంగా చెప్పిన సీఎం

Also read: వరద సాయంపై జగన్ కీలక ఆదేశాలు

Also read: వరద బాధితులకు మైహోం గ్రూపు రూ.5 కోట్ల విరాళం