బ్రేకింగ్: టీడీపీకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

|

Apr 13, 2019 | 9:12 PM

ఢిల్లీ: ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలలో సాంకేతిక లోపాలు సహా పోలింగ్‌ నిర్వహణ వైఫల్యాలపై తీవ్ర నిరసన వ్యక్తంచేసిన టీడీపీకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈవీఎంల వ్యవహారంపై టీడీపీకు చెందిన సాంకేతిక నిపుణులుతో కాకుండా పార్టీయేతర ఎక్స్‌పర్ట్స్‌తో చర్చించేందుకు సిద్ధమని తెలిపింది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు తమను మరోసారి కలవ వచ్చని టీడీపీ న్యాయవిభాగం అధ్యక్షుడు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు ఈసీ ముఖ్య కార్యదర్శి లేఖ పంపారు. శనివారం మధ్యాహ్నం […]

బ్రేకింగ్: టీడీపీకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
Follow us on

ఢిల్లీ: ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలలో సాంకేతిక లోపాలు సహా పోలింగ్‌ నిర్వహణ వైఫల్యాలపై తీవ్ర నిరసన వ్యక్తంచేసిన టీడీపీకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈవీఎంల వ్యవహారంపై టీడీపీకు చెందిన సాంకేతిక నిపుణులుతో కాకుండా పార్టీయేతర ఎక్స్‌పర్ట్స్‌తో చర్చించేందుకు సిద్ధమని తెలిపింది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు తమను మరోసారి కలవ వచ్చని టీడీపీ న్యాయవిభాగం అధ్యక్షుడు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు ఈసీ ముఖ్య కార్యదర్శి లేఖ పంపారు. శనివారం మధ్యాహ్నం సీఈసీ సునీల్‌ అరోరాతో ఏపీ సీఎం చంద్రబాబు సుమారు రెండు గంటల పాటు భేటీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసీ ఓ స్వతంత్ర వ్యవస్థగా కాకుండా.. ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లో పనిచేస్తుందంటూ సీఎం మండిపడిన విషయం తెలిసిందే.