కుప్పంలో చంద్రబాబు మెజారిటీ పెరిగేనా? తగ్గేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి సీఎం అవుతారా లేదా అనే విషయం తేలాలంటే… మరో నెల రోజులకు పైగా ఎదురు చూడాల్సిందే.  ఇదిలా ఉంటే… ఈ సారి కుప్పంలో చంద్రబాబు మెజారిటీ పెరుగుతుందా? పెరిగిన ఓటింగ్ శాతంతో ఏ పార్టీకి ప్రయోజనం? ఇప్పటికే కుప్పం నుంచి డబుల్ హ్యట్రిక్ కొట్టిన చంద్రబాబు మెజారిటీ గత రెండు సార్లు నుంచి తగ్గుతూ వస్తుంది. అక్కడ ఆయనకు వచ్చే మెజారిటీ కుప్పం లోక్ సభ స్థానం విజయంలో […]

కుప్పంలో చంద్రబాబు మెజారిటీ పెరిగేనా? తగ్గేనా?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 16, 2019 | 5:02 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి సీఎం అవుతారా లేదా అనే విషయం తేలాలంటే… మరో నెల రోజులకు పైగా ఎదురు చూడాల్సిందే.  ఇదిలా ఉంటే… ఈ సారి కుప్పంలో చంద్రబాబు మెజారిటీ పెరుగుతుందా? పెరిగిన ఓటింగ్ శాతంతో ఏ పార్టీకి ప్రయోజనం? ఇప్పటికే కుప్పం నుంచి డబుల్ హ్యట్రిక్ కొట్టిన చంద్రబాబు మెజారిటీ గత రెండు సార్లు నుంచి తగ్గుతూ వస్తుంది. అక్కడ ఆయనకు వచ్చే మెజారిటీ కుప్పం లోక్ సభ స్థానం విజయంలో కీ రోల్ పోషించబోతోంది. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని ఎవరూ ఊహించలేరు. అది సాధ్యమవుతుందని వైసీపీ కూడా భావించడం లేదు. అయితే చంద్రబాబు మెజార్టీని సాధ్యమైనంత మేరకు తగ్గించాలన్నది వైసీపీ వ్యూహమని… ఇందుకోసం వైసీపీ అనేక ఎత్తుగడలు వేసిందని ప్రచారం జరుగుతోంది.

1989లో చంద్రబాబు కుప్పం నుంచి కేవలం 6,918 మార్జిన్‌తో గెలుపొందారు. 1999లో ఆయన మెజారిటీ 66,000 కాగా 2004లో 59, 588 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.  2009లో కుప్పంలో 46, 066 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన బాబు.. 2014లో 47,121 మార్జిన్‌తో విజయఢంకా మోగించారు. 2014లో మెజారిటీ తగ్గడానికి కారణం వైసీపీ నియోజక వర్గంలో ఎక్కువగా ఉన్న వన్య కుల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి అయిన చంద్రమౌళిని రంగంలోకి దింపడం.  దీంతో ఈ సారి టీడీపీ అధినేతకు కుప్పంలో ఎంత మెజార్టీ వస్తుందనే అంశంపై జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాలు రావడానికి మరో నెల రోజులకు పైగా సమయం ఉండటంతో… బుకీలు బెట్టింగ్ రాయుళ్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కుప్పం నియోజకవర్గంలో ఈ సారి ఏకంగా 85.25 శాతం నమోదవ్వడవ్వంతో..పెరిగిన ఓటింగ్ శాతం ఎవర్ని ఇబ్బంది పెడుతందో అని స్టేట్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కుప్పంలో జరిగిన బహిరంగ సభలో తమ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ హామి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు మెజార్టీపై పందెం రాయుళ్లను బుకీలు ఊరిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు మెజార్టీ ఈ సారి గతం కంటే పెరుగుతుందా ? లేక తగ్గుతుందా ? అనే దానిపై జోరుగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే చాలామంది ఈ సారి చంద్రబాబు మెజార్టీ గతంతో పోలిస్తే తగ్గుతుందని పందేలు కాస్తున్నట్టు సమాచారం. అసలు విషయం తేలాలంటే మే 23న ఈవీఎంలు తెరిచేవరకు వెయిట్ చేయాల్సింేద

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు