త్రిపుల్ తలాక్ బిల్లు రెడీ

, త్రిపుల్ తలాక్ బిల్లు రెడీ

త్రిపుల్ తలాక్ పద్దతిని నేరంగా పరిగణించే కొత్త బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం అమోదించింది. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కూడా తెలుస్తోంది. గత ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందలేదు. 16వ లోక్ సభ రద్దవ్వడంతో.. దీని గడువు కూడా ముగిసిపోయింది.

అయితే జూన్ 17న ప్రారంభమయ్యే 17వ లోక్‌సభ సమావేశాల్లో.. ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ వెల్లడించారు. కాగా, ఆ బిల్లులోని కొన్ని అంశాలను విపక్షాలు వ్యతిరేకించడంతో గతంలో రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించలేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆధిక్యం లేకపోవడం కూడా ఒక కారణం. ఈ త్రిపుల్ తలాక్ పద్దతిని పాటించడం నేరంగా పరిగణిస్తూ, ఆ విధంగా విడాకులు ఇచ్చే భర్తకు జైలు శిక్ష విధించేలా ఉన్న నిబంధనను విపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *