డిజిటల్ వేదికగా ప్రధాని మోదీ బీహార్ ఎన్నికల ర్యాలీలుః బీజేపీ

ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు. ఎన్డీయే ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా మొత్తం 12 ర్యాలీల్లో ఆయన పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

డిజిటల్ వేదికగా ప్రధాని మోదీ బీహార్ ఎన్నికల ర్యాలీలుః బీజేపీ
Follow us

|

Updated on: Oct 19, 2020 | 6:28 PM

ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు. ఎన్డీయే ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా మొత్తం 12 ర్యాలీల్లో ఆయన పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మొదట అక్టోబర్ 23న ససరం,గయా,భాగల్‌పూర్‌లలో జరిగే ఎన్నికల ర్యాలీల్లో మోదీ పాల్గొననున్నట్లు బీహార్‌ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ప్రధాని మోదీ ర్యాలీలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు ఎన్డీయే మిత్రపక్ష నేతలు హాజరవుతారని చెప్పారు.

కొవిడ్ -19 నిబంధనల నేపథ్యంలో సాధ్యమైనంతవరకు ప్రజలను చేరుకునే ప్రయత్నంలో భాగంగా ప్రధానినరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలను డిజిటల్‌గా ప్రసారం చేయాలని బీజేపీ భావిస్తోంది. మోదీ పాల్గొనే ర్యాలీలను డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారం చేయనున్నట్లు ఫడ్నవీస్ తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఐదు గ్రామాల్లో సమాంతరంగా ఎల్‌ఇడిల ద్వారా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ విధంగా ఒకేసారి 100 సమావేశాలను నిర్వహిస్తామన్నారు. కోవిడ్ -19 దృష్టిలో ఉంచుకుని సామాజిక దూరాన్ని నిర్ధారించడానికి ఇవిధంగా ఫ్లాన్ చేశామన్నారు ఫడ్నవిస్.

ఎన్డీఏ అభ్యర్థుల కోసం ప్రధాని మోదీ బీహార్‌లో 12 ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 23 న ససారాం, గయా, భాగల్‌పూర్‌లో ర్యాలీలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 28 న దర్భంగా, ముజఫర్‌పూర్, పాట్నాల్లో ర్యాలీల్లో పాల్గొంటారు. నవంబర్ 3 న ఛప్రా, తూర్పు చంపారన్, సమస్తిపూర్లలో ర్యాలీలు నిర్వహిస్తారు. నవంబర్ 3 న పశ్చిమ చంపారన్, సహర్సా, అరేరియాలో ర్యాలీలు జరుగుతాయని ఫడ్నవిస్ చెప్పారు.

కాగా,మొత్తం మూడు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. బీహార్‌లో 243 మంది సభ్యుల అసెంబ్లీలో అక్టోబరు 28న తొలి దశ, నవంబరు 3న రెండో దశ, నవంబరు 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. బిజెపి, జెడియు వరుసగా 121-122 సీట్లలో పోటీ చేస్తున్నాయి. నవంబరు 10న ఫలితాలను ప్రకటిస్తారు.