బిగ్‌బాస్ 3: అత్యంత పారితోషికం ఆ ముగ్గురికేనా..!

15మంది కంటెస్టెంట్‌తో బిగ్‌బాస్ 3 అట్టహాసంగా ప్రారంభమైంది. హౌస్‌లో వారందరి సందడి కూడా మొదలైంది. ఇక ఈ సీజన్‌లో మీడియాకు చెందిన సావిత్రి అలియాస్ శివజ్యోతి, జాఫర్ ఎంట్రీ ఇచ్చారు. అయితే వీళ్ల రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు తెగ వార్తలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్‌గా జరిగే టీవీ షోలను వదులుకొని వచ్చారంటే వీళ్లకు పెద్ద మొత్తంలో పారితోషికం అందిందని టాక్ వినిపిస్తోంది.

బిగ్‌బాస్ 2లో సింగర్ గీతా మాధురి ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. రోజుకి లక్ష రూపాయల దాక ఆమె తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక మూడవ సీజన్లో రోజుకి రెండు లక్షలు ముట్టజెప్పి మరీ సెలబ్రిటీలను తీసుకున్నారట. ఇంత పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ ఎవరెవరికి ఇచ్చారంటూ ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. వాటికి సమాధానంగా పటాస్ ద్వారా పాపులర్ అయిన శ్రీముఖి, తెలంగాణ యాసతో ఫేమస్ అయిన సావిత్రికి ఎక్కువ పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే వీరిద్దరికి ఎక్కువ క్రేజ్ ఉంది. అటు సింగర్ రాహుల్‌కు కూడా యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. దీంతో వీళ్లు ముగ్గురికి భారీగానే ముట్టజెప్పి ఉంటారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు అందరికంటే తక్కువగా అషురెడ్డికి ఇచ్చారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *